Allu Sneha Reddy : సోషల్ మీడియాలో బన్నీ భార్య స్నేహారెడ్డి హల్​చల్​.. గ్లామరస్​ ఫొటోషూట్స్​ వెనుక కారణమదే..!ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు ప్యాన్ ఇండియా రేంజ్​లో ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ బన్నీ క్రేజ్ మామూలుగా ఉండదు. తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించి బన్నీ షేర్ చేసే పోస్టులకు తెగ లైకులు, షేర్లు వచ్చేస్తాయి. ఇక సోషల్ మీడియాలో Allu Sneha Reddy కూతురు అర్హాతో కలిసి బన్నీ చేసే సందడి అంతా ఇంతా కాదు. అర్హతో సందడి చేస్తున్న వీడియోలు షేర్ చేసి ఫ్యాన్స్​ని ఖుష్ చేస్తాడు.

 

Allu Sneha Reddy
Allu Sneha Reddy

అల్లు అర్జునే కాదు సోషల్ మీడియాలో బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డికి కూడా మామూలు ఫాలోయింగ్ లేదు. స్నేహారెడ్డి ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే ఈ బ్యూటీ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గ్లామరస్ ఫొటోషూట్స్​తో, తన పిల్లల క్యూట్ పిక్స్, వీడియోస్​తో స్నేహా సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. ఓ హీరోయిన్​కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది ఈ అల్లు బ్యూటీకి.

సోషల్ మీడియాలో స్నేహారెడ్డి ఫొటోలు చూసి ఈ బ్యూటీ తరచూ ఫొటో షూట్స్ ఎందుకు చేస్తుంటుంది అని చాలా మంది ఆలోచిస్తుంటారు. స్నేహ గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.  అయితే ఈ గ్లామరస్ ఫొటోషూట్ వెనక ఓ బలమైన కారణముందట. అదేంటంటే..?

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

 

స్నేహారెడ్డి అల్లు అర్జున్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పడాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దానికోసం ఆమె తెగ తాపత్రయపడుతోందట. బన్నీ భార్యగానే కాకుండా తాను కూడా ఓ సెలబ్రిటీ కావాలనుకుంటోందట. దాని కోసమే ఆమె సోషల్ మీడియాను ఎంచుకుందట. సాధారణంగానే హై క్లాస్ సొసైటీకి చెందిన మహిళలు కాస్త ట్రెండీగా ఉంటారు. డిజైనర్ ఔట్​ఫిట్స్ ధరించి వెకేషన్లకు వెళ్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇదంతా ఇప్పుడు కామన్ అయిపోయింది.

స్నేహారెడ్డి కూడా తరచూ డిజైనర్ వేర్స్ ధరించి స్టార్ హీరోయిన్స్​కి గట్టి పోటీనిస్తోంది. తన కోసం సొంతంగా ఓ ఫ్యాషన్ డిజైనర్​ని కూడా ఆమె హైర్ చేసుకుందట. అతడెవరో కాదు. సమంత పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ ప్రియాంక జవాల్కర్. స్నేహ ఎక్కువగా అతడు రూపొందించిన ఔట్​ఫిట్స్​ ధరిస్తూ ఉంటుంది. అంతే కాకుండా బాలీవుడ్ ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, డిజైనర్ అనితా డోంగ్రే వంటి వారి ఔట్​ఫిట్స్ కూడా ధరిస్తుంది స్నేహ.

తాజాగా తన స్నేహితురాలి వివాహానికి అల్లు అర్జున్​తో కలిసి సౌతాఫ్రికా వెళ్లింది స్నేహ. అక్కడ పెళ్లి వేడుకలో డిజైనర్ దుస్తులు ధరించి ఫొటో షూట్ కూడా చేయించుకుంది. ఆ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. స్నేహ ఫొటోలు చూసి నెటిజన్సే కాదు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. హీరోయిన్​లాంటి అందంతో స్నేహ ఫిదా చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

ఇలా స్నేహ గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు కొందరు. పెళ్లి కాక ముందు స్నేహా రెడ్డి హీరోయిన్ కావాలి అనుకుందట. అందుకోసం ఆమె ప్రయత్నాలు చేయాలి అనుకుందట. స్నేహా రెడ్డి తండ్రి సుధాకర్ రెడ్డి హైదరాబాద్ లో కొన్ని విద్యాసంస్థలు నడుపుతున్నారు. ఆయన స్నేహా రెడ్డి కోరికను కాదన్నారట. హీరోయిన్ కావడానికి ఒప్పుకోలేదట. పేరెంట్స్ అనుమతి లేకపోవడంతో చేసేది లేక స్నేహారెడ్డి తన కలను చంపుకుందట.

స్నేహారెడ్డికి హీరో అల్లు అర్జున్ భర్తగా వచ్చాడు. దాంతో తాను కోరుకున్న సినిమా ప్రపంచంలో ఆమె అడుగుపెట్టారు. సినిమా కుటుంబంలోకి కోడలిగా వెళ్లింది. అప్పుడు అణుచుకున్న తన కోరికను స్నేహారెడ్డి ఇప్పుడిలా తీర్చుకుంటోంది. తన అభిప్రాయాలకు గౌరవం ఇచ్చే భర్త దొరకడంతో డిజైనర్ వేర్స్ ధరించి గ్లామరస్ ఫొటో షూట్స్ చేస్తోంది. ఆ విధంగా హీరోయిన్ కావాలనుకున్న తన కోరిక, వెండితెరపై అందంగా కనిపించి అలరించాలన్న ఆశ తీర్చుకుంటోందట స్నేహ.

ఇటీవల స్నేహారెడ్డి ఓ స్టార్ హీరో మూవీలో నటిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సదరు మూవీలో ఆమె కీలక రోల్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక 2011 లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ వేడుకలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. పదేళ్లకు పైగా అన్యోన్య దంపతులుగా ఉంటున్న ఈ జంటకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.