DJ Tillu 2 : టిల్లు నుంచి హీరోయిన్లు పారిపోతోంది అందుకేనట.. క్లారిటీ వచ్చేసింది..!

- Advertisement -

DJ Tillu 2 : డీజే టిల్లు.. ఈ ఏడాదిలో హిట్ అయిన సినిమాల్లో పీక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా ఇది. కాస్త లిప్ లాక్ సీన్లతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బంది పెట్టినా.. ఇంటిల్లిపాది కూర్చొని జాలీగా ఈ మూవీ చూసేయచ్చు. ఇక ఈ మూవీలో టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ యాస, యాటిట్యూడ్ సినిమాకు ప్రాణం పోశాయి. ఇది నిజంగానే నువ్వు నన్ను అడుగుతున్నవా రాధికా.., బిగినర్స్ మిస్టెక్స్ ఇవన్నీ.. అట్లుంటది మనతోని.. అంటూ మాస్ డైలాగ్స్ తో యువతను ఆకట్టుకున్నాడు. డీజే టిల్లు సాంగ్ తో ప్రతి ఫంక్షన్ ను ఉర్రూతలుగించాడు. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్.

DJ Tillu

‘టిల్లు స్క్వేర్’ పేరుతో డీజే టిల్లుకు సీక్వెల్ ప్లాన్ చేశారు. ముహూర్తం ఫిక్స్ అయింది.. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. షూటింగ్ షురూ కాకముందే ఈ సినిమాకు డైరెక్టర్ మారిపోయాడు. విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ వచ్చి చేరాడు. సీక్వెల్ లో నటించాల్సిన హీరోయిన్ నేహా శెట్టి కూడా మూవీ నుంచి ఔట్ అయింది. ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. షూటింగ్ మొదలైంది. అక్కడ నుంచి ‘టిల్లు స్క్వేర్’కు తిప్పలు షురూ.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తప్పుకుంది. ఆ స్థానంలో ‘ప్రేమమ్’ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ వచ్చేసిందని ప్రచారం జరిగింది.

Meenakshi and Ketika

తను కూడా ఈ ప్రాజెక్ట్ కి టాటా చెప్పేసిందట. ప్రస్తుతం ‘హిట్ 2’ ఫేమ్ మీనాక్షీ దీక్షిత్ లేదా రొమాంటిక్ భామ కేతిక శర్మలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం వుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా సినిమా ప్రారంభం లోనే హీరోయిన్లు వాకౌట్ చేస్తూ బయటికి వెళ్లిపోవడానికి అసలు కారణం ఏంటని ఎందుకు హీరోయిన్లు ఈ మూవీలో నటించడానికి ఆసక్తిని చూపించడం లేదనే చర్చ మొదలైంది. ఇందుకు కారణం హీరో రైటర్ సిద్దూ అని అతనితో ఉండే ఇంటిమేట్ సీన్ల వల్లేనని తెలుస్తోంది.  

- Advertisement -

‘డీజే టిల్లు’లో రాధిక పాత్రలో నటించిన నేహా శెట్టితో సిద్దూ జొన్నల గడ్డ లిప్ లాక్ సీన్ లు చేసిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్ లో మాత్రం అంతకు మించి ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయట. అవే హీరోయిన్లను భయపెడుతున్నాయని టాక్. సిద్దూతో ఆ ఇంటిమేట్ సీన్లు చేయలేకే వచ్చిన హీరోయిన్ వచ్చినట్టే సెట్ లో షూటింగ్ మొదలు కాకుండానే పారిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ మూవీకి రైటర్ కూడా హీరో సిద్దూ జొన్నలగడ్డనే కావడంతో ఓ రేంజ్ లో ఇంటిమేట్ సీన్లు రాశాడని టాక్.

సిద్ధూతో ఇంటిమేట్ సీన్లలో నటించడానికి హీరోయిన్లు తెగ ఇబ్బంది పడుతున్నారట. ఆ కారణం వల్లే ఏమీ చెప్పలేక .. ఆ సీన్లలో నటించలేక హీరోయిన్లు ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేస్తున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా సిద్ధూ ఇంటిమేట్ సీన్ల డోస్ తగ్గించి ఓ అడుగు వెనకడుగేస్తాడా.  హీరోయిన్లు  మీనాక్షీ దీక్షిత్, కేతిక శర్మలలో ఎవరైనా ఓకే అంటారో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here