సూపర్ స్టార్ కృష్ణ మరణం అటు సినీ లోకాన్ని.. ఇటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ముఖ్యంగా ఆయన తనయుడు మహేస్ బాబుకు కోలుకోలేని దెబ్బ తీసింది. ఒకే ఏడాదిలో అన్న, తల్లిదండ్రులను కోల్పోయిన మహేశ్ బాబు దుఃఖం ఎవరికీ రాకూడదంటూ అభిమానలోకం ఆవేదన చెందుతోంది.నవంబర్ 16 బుధవారం రోజున సాయంత్రం కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఆయన స్మారకార్థంగా పద్మాలయ స్టూడియోలో కృష్ణ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టంచనున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ వీలునామా, ఆస్తి ఎవరికి దక్కుతుంది? ఎంత దక్కుతుంది? అనే విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై సీనియర్ జర్నలిస్టు ఇమండి రామారావు ఏమన్నారంటే..?
కృష్ణ తన మరణం తర్వాత తన కుటుంబం ఆస్తి తగాదాల జోలికి పోకూడదనే ఉద్దేశంతో చనిపోయే ముందే వీలునామా రాశారని రామారావు అన్నారు. తన వీలునామాలో మనవరాళ్లు, మనవళ్లు, కొడుకులు, కూతుళ్లకు ఏం ఇవ్వాలో ముందుగానే నిర్ణయించారు. కృష్ణ తన కుటుంబంతో పాటు తనని నమ్ముకున్న వాళ్లకు కూడా వీలునామాలో చోటు కల్పించి ఉండొచ్చని తెలిపారు. కుమార్తెల విషయంలో మంజులకు కాస్త ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే అవకాశముందని.. ఎందుకంటే ముగ్గురు కూతుళ్లలో మంజుల కాస్త ఆర్థిక సమస్యల్లో ఉందని చెప్పారు. మరోవైపు తన పెద్ద కుమారుడు రమేశ్ బాబు మరణించినందున అతడి పిల్లలకు ఆస్తిలో కాస్త వాటా ఎక్కువ కల్పించే అవకాశముందన్నారు. నరేశ్ గురించి మాట్లాడుతూ కృష్ణ తనకు ఇవ్వాలనిపించి ఏదైనా నరేశ్ కు ఆస్తిలో వాటా ఇవ్వొచ్చు కానీ.. నరేశ్ కు మాత్రం కృష్ణ ఆస్తిలో వాటా పొందే హక్కు లేదని రామారావు స్పష్టం చేశారు.
మరోవైపు.. సూపర్ స్టార్ కృష్ణ వీలునామాపై ప్రముఖ వాస్తు శిల్పి, ఫినాన్షియల్ అడ్వైజర్, డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మందికి తమ సంతానం కంటే తమ సంతానానికి పుట్టిన వారిపై ఎక్కువ ప్రేమ ఉంటుందని అన్నారు. కృష్ణకు మొదటి భార్య ఇందిరా, రెండో భార్య విజయ నిర్మల, వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఉండటం వల్ల వీలునామాలో ఎవరికి ఎంత ఇచ్చారనేదానిపై అందరికి ఆసక్తి నెలకొందని చెప్పారు.
రెండో భార్య విజయ నిర్మలను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు కొడుకు ఉన్నాడని (నరేష్) ఆయన తెలిపారు. ఇక్కడ ఫస్ట్ భార్య పిల్లలైన మంజులకు, పద్మకు, రమేష్ బాబుకు, మహేశ్ బాబు ఉన్నారు. వాళ్లకు రాయకుండా వాళ్ల పిల్లలకు ఆస్తి రాయడమనేది జరిగిందని డాక్టర్ రెడ్డి వెల్లడించారు.
పిల్లలకంటే వాళ్లకు పుట్టిన పిల్లలపైనే ప్రేమ ఎక్కువ ఉంటుందనడానికి సూపర్ స్టార్ కృష్ణ నిదర్శమని ఫైనాన్షియల్ అడ్వైజర్, వాస్తు శిల్పి, డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి తెలిపారు. “సూపర్ స్టార్ కృష్ణ తన మనవళ్లు, మనవరాళ్ల పేరుపై వీలునామా రాశారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే.. నరేష్ గారికి కూడా వాటా వస్తుందని అందరు అనుకోవడం జరిగింది. కానీ అది రాకపోవడం అనేది శోచనీయం” అని ఆయన పేర్కొన్నారు.