Writer Padmabhushan : ప్రముఖ నటుడు సుహాస్ అదృష్టం ఈమధ్య మామూలుగా లేదు.. ముట్టుకున్న ప్రతీ చిత్రం బంగారంలా మారిపోతుంది, కమెడియన్ గా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమా ద్వారా హీరో అయ్యి తొలి సినిమాతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఆ చిత్రం తర్వాత కూడా కమెడియన్ పాత్రలతో పాటుగా కొన్ని ముఖ్య పాత్రలు పోషించాడు. ఆ పాత్రలు కూడా మంచి గుర్తింపు ని తెచ్చుకున్నాయి.
ముఖ్యంగా హిట్ 2 చిత్రం లో అతని పోషించిన విలన్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది,ఆ సినిమా తర్వాత ఆయన వెంటనే ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమా ద్వారా రీసెంట్ గానే మన ముందుకు వచ్చాడు.విడుదలకు ముందు టీజర్ మరియు ట్రైలర్ తో ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా విడుదల తర్వాత అదే రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.టాక్ బాగా రావడం తో వీకెండ్ ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 6 కోట్ల రూపాయలకు జరిగింది.సుహాస్ రేంజ్ కి ఇది చాలా ఎక్కువే,బ్రేక్ ఈవెన్ కష్టమేమో అని అందరూ అనుకున్నారు,కానీ మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి, మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా సెన్సేషన్ సృష్టించిందనే చెప్పాలి.
ఎందుకంటే అక్కడ ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రెండు లక్షల డాలర్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది.. గుట్టు చప్పుడు కాకుండా రైటర్ పద్మభూషణ్ విడుదలైన ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రావడం అంటే సాధారణమైన విషయం కాదు, ఫుల్ రన్ లో హాఫ్ మిలియన్ మార్కుని అందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే ఈ ఏడాది ఓవర్సీస్ లో భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని చెప్తున్నాయి ట్రేడ్ వర్గాలు.