Writer Padmabhushan Review : క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్.. సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review


Writer Padmabhushan Review : ‘కలర్ ఫోటో’తో సుహాస్ కథానాయకుడిగా మారారు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. అంతకు ముందు ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఇప్పుడు సుహాస్, ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలయికలో ‘రైటర్ పద్మభూషణ్’ వచ్చింది. ఈ చిత్రంలో టీనా శిల్ప రాజ్ హీరోయిన్.. అబద్దాలతో ప్రేమను ఎలా నిలుపుకుంటాడు అనేది కథ.. కాస్త వివరంగా తెలుసుకుందాం రండి…

రైటర్ పద్మభూషణ్ కథ :

పద్మభూషణ్ ఒక లైబ్రరీలో ఉద్యోగి. రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలనేది అతని కోరిక. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఓ పుస్తకం రాస్తాడు. నాలుగు లక్షలు అప్పు చేసి మరీ పబ్లిష్ చేస్తాడు. పేరు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ వేస్తాడు. ఆ పుస్తకం సక్సెస్ కాదు. అయితే, అతడి పేరు మీద ఎవరో పుస్తకం పబ్లిష్ చేస్తారు.

Writer Padmabhushan Review
Writer Padmabhushan Review

ఒక బ్లాగ్ కూడా మైంటైన్ చేస్తారు. అది సూపర్ సక్సెస్ అవుతుంది. దాంతో డబ్బులున్న మేనమామ పిల్లను ఇవ్వడానికి ముందుకు వస్తాడు. మరదలు సారికపై పద్మభూషణ్ మనసు పారేసుకుంటాడు. మరదలు సారికను వదులుకోకూడదని అనుకోవడంతో పాటు తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం, తనకు లభిస్తున్న పేరు చూసి ఆ పుస్తకం రాశానని అబద్ధం చెబుతాడు.. దాన్ని కవర్ చెయ్యడానికి హీరో పడే కష్టాలను తెర మీద చూపించారు.

రైటర్ పద్మభూషణ్ విశ్లేషణ :

ప్రతి మనిషికి ఓ కల ఉంటుంది. దానిని సాకారం చేసుకోవడం కోసం ఎంత కష్టమైనా పడాలనే తపన ఉంటుంది. కష్టపడకుండా కల నెరవేరితే? ఈజీగా మన పాకెట్ పేరు, ప్రతిష్ఠలతో నిండితే? మనసులో నిజాయితీ నిండిన వ్యక్తి అయితే… తనది కాని జీవితంలో అడుగులు వేయడానికి సందేహిస్తూ సంకోచిస్తాడు. అయితే, తాను ప్రేమించిన అమ్మాయి, అమ్మానాన్నల కోసం తప్పటడుగు వేసే ప్రమాదం ఉంది. అటువంటి యువకుడి కథే ‘రైటర్ పద్మభూషణ్.. మధ్యతరగతి ప్రేమ కథ..

మొదటి భాగం మాములుగా ఉంటుంది.. అదే లవ్ రొమాన్స్, మధ్యతరగతి ప్రేమలు ఉంటాయి. సెకండ్ హాఫ్ లో చివరి 20 నిమిషాలు మనల్ని మర్చిపోతాము..అప్పటి వరకు జరిగిన కథను మర్చిపోయి మనసుతో సినిమా చూస్తాం. అంతలా క్లైమాక్స్ సీన్ కదిలిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ప్రేమకథ, ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీ సన్నివేశాల్లో పెద్దగా పస లేదు. ఆ విధంగా చేయడం కరెక్టేనా? కాదా? అనే సందేహం కూడా మనకు రాదు. చాలా లాజిక్స్ గాలికి వదిలేశారు.. కామెడీ కొన్ని చోట్ల బాగా పేలింది..పాటలు, సంగీతం, సినిమాటోగ్రఫి అంతా బాగానే ఉంది.. డైరెక్టర్ తన మార్క్ ను చూపించాడు.

Writer Padmabhushan Movie

సినిమాలో సుహాస్ హీరో. అయితే, సగటు తెలుగు సినిమా హీరోలా ఎక్కడా కనిపించలేదు. స్నేహితుడితో చెంపదెబ్బ తినే సన్నివేశం చేశారు. రంగు మీద సెటైర్ వేసుకున్నారు. డ్యాన్సులు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే… సగటు యువకుడు తెరపై ఉన్నది తానేనని ఫీలయ్యేలా నటించారు. ఇక, నటిగా రోహిణి మరోసారి మెరిశారు.

అమ్మగా ఆవిడ చాలా మంచి పాత్రలు చేశారు. అయితే, ఇందులోని పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తారు. ప్రేక్షకుల మదిలో చిన్న ఆలోచన రేకెత్తిస్తారు. తండ్రిగా ఆశిష్ విద్యార్థి కనిపించడం కొత్తగా ఉంటుంది. టీనా శిల్ప రాజ్, శ్రీ గౌరీ ప్రియ… అమ్మాయిలు ఇద్దరూ క్యారెక్టర్లకు సూట్ అయ్యారు.. మొత్తానికి ఎవరికీ వారే అన్నట్లు నటించారు..

సినిమా : రైటర్ పద్మభూషణ్
నటీనటులు : సుహాస్, టీనా శిల్ప రాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ తదితరులు
ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్ శాకమూరి
నేపథ్య సంగీతం, స్వరాలు : కళ్యాణ్ నాయక్
స్వరాలు : శేఖర్ చంద్ర
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్
రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్
విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2023

చివరగా.. అక్కడక్కడ నవ్వించడంతో చివర్లో మనసు పొరలో తడిని బయటకు తీసుకొచ్చే చిత్రమిది. అమ్మను ఓ మాట అడగాలని మనలో ఆలోచన తీసుకొచ్చే చిత్రమిది. క్లైమాక్స్ సీన్ ఒక్కటీ టికెట్ రేటుకు న్యాయం చేస్తుంది.. అమ్మ సెంటిమెంట్ ఉంది..