జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ప్రపంచ వ్యాప్తంగా 13 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు మించిన విజువల్స్ ఇప్పటికీ రాలేదు. ఎప్పటికీ రాదేమో. ఈ సినిమా సీక్వెల్‌గా అవతార్-2 ( Avatar 2 ) ది వే ఆఫ్ వాటర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 16న ఈ చిత్రం విడుదలవనుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్ వరంగా వండర్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘అవతార్-2’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల మందుకు రానుంది. ఎప్పుడెప్పుడు డిసెంబర్ 16 వస్తుందా అని ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లు ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. సముద్ర గర్భంలో జేమ్స్ కామెరూన్ ఈ సారి ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో అని సినీ ప్రేమికుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఈ మూవీ తెలుగు భాషలోనూ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.A
అవతార్ -2 సినిమాకు తెలుగు డబ్బింగ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ కు సంబంధించి టాలీవుడ్ హీరో/డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ మాటల రచయితగా వర్క్ చేశారట. నటుడిగా, దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ టాలీవుడ్‌కు సుపరిచితమే. ఇటీవలే రిలీజైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో డా.వరుణ్ పాత్రలో నటించాడు. కాగా శ్రీనివాస్‌కు అవతార్ సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం రావడం విశేషం అనే చెప్పాలి.
ఇటీవలే వచ్చిన ‘బ్రహ్మస్త్ర’ తెలుగు వెర్షన్‌కు కూడా ఆయనే మాటలు రాశాడు. ఈయన సినిమాల్లోని లాగ్స్ సరదాగా, మన దగ్గరి వాళ్ల తో మాట్లాడే విధంగా ఉంటాయి. అవతార్‌కు కూడా అదే విధంగా డైలాగ్స్ రాసి ప్రేక్షకులను మెప్పిస్తాడని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాగశౌర్యతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే రామ్‌కామ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ వీకెండ్‌కు సంబంధించిన టికెట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఫ్యాన్స్ కూడా రిలీజ్ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. అదేంటంటే.. ‘అవతార్ 2’ తెలుగు వెర్షన్ కోసం స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ పనిచేశారని అంటున్నారు. తెలుగు డైలాగ్స్ అన్ని ఆయనే రాశారని సోషల్‌మీడియాలో ప్రచారం సాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ వీకెండ్‌కు సంబంధించిన టికెట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఫ్యాన్స్ కూడా రిలీజ్ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. అదేంటంటే.. ‘అవతార్ 2’ తెలుగు వెర్షన్ కోసం స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ పనిచేశారని అంటున్నారు. తెలుగు డైలాగ్స్ అన్ని ఆయనే రాశారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.