Avatar 2 : రిలీజ్​కు ముందే కోట్లు కురిపిస్తున్న మూవీ.. ఎందుకింత డిమాండ్..?

Avatar 2


ప్రపంచ సినిమాలో మరిచిపోలేని అద్భుతం అవతార్. డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్ . వరల్డ్ సినిమాలో విజువల్ వండర్ అవతార్. అందుకే ఈ సినిమాకు కోట్ల మంది అభిమానులు. టేకింగ్, గ్రాఫిక్స్, బీజీఎం, వసూళ్లు ఇలా అన్నింట్లో వండర్స్ సృష్టించిన అవతార్​కు పార్ట్ 2 Avatar 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వేచి చూస్తూనే ఉన్నారు. ఇక ఫ్యాన్స్​కు ఎక్కువ వెయిట్ చేయించొద్దని అవతార్ సీక్వెల్​ను త్వరలోనే ముందుకు తీసుకురాబోతున్నారు.

ఈ సినిమా సీక్వెల్‌గా ‘అవతార్-‌2’ ది వే ఆఫ్‌ వాటర్‌ తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్‌ 16న ఈ చిత్రం విడుదలవ్వనుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే వండర్స్ క్రియేట్‌ చేస్తోంది. తాజాగా బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా.. టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిరోజే దాదాపు 2 లక్షల మంది టికెట్లను కొనుగోలు చేశారు. దీంతో ఆల్‌ ఇండియా మొత్తం రూ.7 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న కేజీఎఫ్‌2, బాహుబలి2 సినిమాలను సవాలు చేస్తూ ఆల్‌ టైమ్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అవతార్‌2 ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు అమ్ముడుపోయిన టికెట్స్‌లో సుమారు లక్షకు పైగా కేవలం PVR, Inox , Cinepolisలలోనే బుక్‌ చేసుకోవడం గమనార్హం.

Avatar 2
Avatar 2

ఇక అవతార్‌ టికెట్స్‌ వీకెండ్ బుకింగ్స్‌ చూస్తే వావ్‌ అనకుండా ఉండలేరు. వీకెండ్‌లో సుమారు 4.10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది త్వరలోనే 5లక్షల మార్కును చేరడానికి సిద్ధంగా ఉంది. దీంతో వీకెండ్ గ్రాస్ రూ.16 కోట్లకు చేరింది. మొత్తం అవతార్‌ సినిమా ప్రీసేల్‌ బుకింగ్స్‌ రూ.45 కోట్ల నుంచి రూ.80 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.

అవతార్‌ మొదటి భాగంలో పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్‌.. రెండో భాగంలో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘‘అవతార్‌ ఐదో భాగం(Avatar 5) 2028లో వచ్చే అవకాశం ఉంది. అందులో సినిమాలోని పాత్రలన్నీ ఒక మంచిపని కోసం భూమి పైకి వస్తాయి’’ అని ప్రమోషనల్‌ టూర్‌లో నిర్మాత జోన్‌ లాండౌ చెప్పారు.

‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ పేరుతో డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర రన్‌టైమ్‌ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘అవతార్‌2’ నిడివి 192 నిమిషాల, 10 సెకన్లు అట. అంటే 3 గంటలా 12 నిమిషాల 10 సెకన్లు. ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా, థియేటర్‌లో ప్రేక్షకుడిని అంత సేపు కూర్చోబెట్టాలంటే అందుకు తగిన కథ, కథనాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండాలి.

‘అవతార్2’ రన్‌ టైమ్‌ విషయంలో దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ పూర్తి విశ్వాసంతో ఉన్నారట. మూడు గంటల పాటు మరో కొత్త ప్రపంచంలో ప్రేక్షకుడిని తీసుకెళ్లడం ఖాయమని చెబుతున్నారు. 2009లో వచ్చిన మొదటి ‘అవతార్‌’ చిత్రం రన్‌ టైమ్‌ 162 నిమిషాలు. అంటే 2 గంటలా 42 నిమిషాలు మాత్రమే. మొదటి భాగంతో పోలిస్తే, పార్ట్‌2 అదనంగా దాదాపు మరో అరగంట నిడివి పెరిగింది.

Book Movie Tickets Avatar – 2 : Book My Show