Shruti Haasan : సినిమా ఇండస్ట్రీలో ఏజ్ ఆబ్లిగేషన్ హీరోయిన్లకు మాత్రమే. హీరోలకు ఉండదు. అందుకే 50 ఏళ్ల వయసున్న హీరోలు కూడా 20 ఏళ్ల యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. కథానాయికలకు మాత్రం ఆ ఛాన్స్ ఉండదు. పెళ్లయిందంటే చాలు హీరోయిన్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే. ఇక పిల్లలు పుట్టి కాస్త ఏజ్ బార్ అయితే వాళ్లు తల్లి, అక్క పాత్రలకే పరిమితం చేస్తారు. అయితే కొన్నిసార్లు సీనియర్ హీరోల పక్కన నటించడానికి యంగ్ హీరోయిన్లు ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం హాట్ బ్యూటీ శ్రుతి హాసన్ కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. ముఠామేస్త్రీ అందరి వాడు సినిమాలని గుర్తు చేస్తూ వింటేజ్ లుక్ లో ఊర మాస్ అవతార్ లో చిరంజీవి కనిపిస్తున్న తీరు ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.
ఈ మూవీ కోసం చిరంజీవి-శ్రుతిహాసన్ లపై `నువ్వు శ్రీదేవైతే.. నేను చిరంజీవినవుతా..` అంటూ ఫారిన్ లో షూట్ చేసిన సాంగ్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ షూటింగ్ లో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని శ్రుతిహాసన్ చెప్పింది. ఈ సాంగ్ షూటింగ్ లో శ్రుతిహాసన్ తీవ్ర అసౌకర్యానికి గురైందట. ఇదే విషయాన్ని శ్రుతిహాసన్ వెల్లడించింది.
మంచు కొండల్లో మైనస్ డిగ్రీల చలిలో ఈ పాటని చిత్రీకరించారు. అయితే ఈ పాటలో ఎక్కవ శాతం శారీలో కనిపించిన శృతి దాని కారణంగా ఇబ్బందిపడ్డానని తెలిపింది. మరో సారి శారీలో నటించలేనని చెప్పింది. ఎందుకంటే తను ఫిజికల్ గా చాలా అసౌకర్యానికి గురైందట. అంతే కాకుండా చిరంజీవి తో స్టేప్పులేయడం అంత ఈజీ కాదని చెప్పింది ఈ భామ. ఫ్యాన్స్ కోసమే ఈ పాటలో చీరలో కనిపించానని అయితే అది తనని చాలా ఇబ్బందికి గురిచేసిందని తెలిపి షాకిచ్చింది.
ఒకేసారి ఇద్దరు స్టార్లతో కలిసి నటించడంపై స్పందిస్తూ `ఈ విషయంలో తాను అసలు భయపడలేదని రెండు టీమ్ లు చాలా కష్టపడి పని చేశారని చెప్పింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో తాను భాగం కావడం ఆనందంగా ఉందని అంతే కాకుండా ఈ రెండు సినిమాలని ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం రేర్ అని తెలిపింది. `వాల్తేరు వీరయ్య` జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ కానుండగా `వీర సింహారెడ్డి` జనవరి 12న విడుదల కాబోతోంది.