Cheeranjivi : చిరు ఇంత కరువులో ఉన్నాడా..స్టేజ్ పైనే హీరోయిన్ ను వదలకుండా..Cheeranjivi : మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికి తెలుసు.. సినిమాలకు బ్రాండ్ ఆయన.. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన చిరు గ్యాప్ లేకుండా సినిమాలను చేస్తున్నారు.. మొన్నీమద్య గాడ్ ఫాదర్ సినిమాతో బ్లాక్ బాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. ఈ మధ్య చిరు చిలిపిగా మారి పోయాడు..వయస్సు పెరుగుతున్నా కూడా స్టేజ్ పైకి వెళితే హీరోయిన్లను వదలడు అనే పేరు తెచ్చుకున్నాడు.. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యింది..స్టేజ్ పైన హీరోయిన్ ను వదలకుండా పిసికేశాడు..అందుకు సంబందించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Cheeranjivi
Cheeranjivi

స్టేజ్ ఎక్కారంటే ఏదో ఒక లీక్ ఉంటుంది. తన సినిమాల గురించి కాకుండా ఒక్కోసారి తెలిసిన వాళ్ళ సినిమాల గురించి సైతం పొరపాటున నోరు జారుతుంటారు. అలాగే హీరోయిన్లతో చిరు చిలిపి పనులు మరింత అట్రాక్ట్ చేసుంటాయి. గతంలో ఆచార్య సినిమా ఫంక్షన్ లో పూజా హెగ్డేతో ఫోటోలు దిగేందుకు చిరు పడిన పాట్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఇలాంటి సందర్భమే ఒకటి వెలుగు చూసింది..దాంతో చిరు మళ్ళీ ట్రోల్స్ కు గురవుతున్నాడు..

చిరు లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య, బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. ఊరమాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

Waltair Veerayya
Waltair Veerayya

ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన టీజర్‌, గ్లింప్స్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే మంగళవారం ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ చిత్రటీమ్ మొత్తం పాల్గొంది. వాల్తేరు వీరయ్య స్పెషల్ సాంగ్ బాస్ పార్టీలో చిరుతో కలిసి ఆడిపాడిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా సైతం ప్రెస్ మీట్ కు హాజరు అయింది. ఈ సందర్భంగా చిరు ఏం మాట్లాడను అంటూనే సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడేశారు. అందరి గురించి ప్రతిదీ చెప్పారు..ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా గురించి కూడా ఆయన మాట్లాడారు..

ఆమెతో స్టేజ్‌పైనే సరసాలు ఆడారు. బాస్ పార్టీ సాంగ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఆ సాంగ్ కి ఎవర్ని పెడతారో ఏంటో అని అనుకున్నప్పుడు ఊర్వశి అన్నారు. ఇక ఊర్వశి కనబడగానే నాకు మాటలు రాలేదు. ఫుల్‌ జోషల్‌తో ఊర్వశి డ్యాన్స్‌ చేసింది అంటూ ఊర్వశికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు చిరు. అయితే ఆ చెయ్యి వెనక్కి తీసుకునేటప్పుడు.. అతుక్కుపోయింది, ఆమె చేతి నుండి రావడం లేదు అని మెలికలు తిరుగుతూ చిరు నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..అది చూసిన మెగా ఫ్యాన్స్ ఏంటి బాసూ ఇంత కరువా అంటూ కామెంట్లు చేస్తున్నారు..