Samantha : డబ్బు కోసం ఏది పడితే అది రాసేస్తారా.. నిజానిజాలు తెలుసుకోరా..?

- Advertisement -

Samantha : ఏం మాయ చేశావే అంటూ తెలుగు కుర్రాళ్లను తన మాయలో పడేసింది సమంత. జెస్సీగా ప్రతి ఒక్క యువకుడి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాతో కేవలం తెలుగు కుర్రాళ్ల గుండెల్లోనే కాదు ఆ సినిమాలో తన కోస్టార్ గా నటించిన యువసామ్రాట్ నాగచైతన్య హృదయంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. చై-సామ్ లు కలిసి తీసిన సినిమాలు టాలీవుడ్ కు చాలా స్పెషల్. టాలీవుడ్ పవర్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట సడెన్ గా తమ విడాకుల న్యూస్ చెప్పి షాక్ ఇచ్చింది.

Samantha
Samantha

విడాకుల సమస్య నుంచి తేరుకుని సినిమాల్లో దూసుకెళ్తున్న సమంత లైఫ్ లో సడెన్ గా బ్రేక్ పడింది.  తెలుగు సినిమాలు, హిందీ వెబ్‌సిరీస్‌ లు ఇలా సక్సెస్‌తో పలు బాలీవుడ్‌ ఆఫర్లు కూడా వచ్చాయి. అంతా బాగుందనుకునే సమయంలో మయోసైటిస్‌ అనే ఆటోఇమ్యూనీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు సామ్‌ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఒక్కసారిగా సామ్ ఫ్యాన్స్ బాధలో కూరుకుపోయారు.

ఇక అప్పటి నుంచి సమంత ఆరోగ్యంపై, సినిమా కెరీర్ పై సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రకరకాల వార్తలొస్తున్నాయి. సామ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలే కాదు, ఇప్పటికే ఆమె ఒప్పుకొన్న సినిమాలపైనా సందిగ్ధత ఏర్పడిందని పలు మీడియా ప్లాట్ ఫామ్ లు వార్తలు రాశాయి. ముఖ్యంగా కొన్ని బాలీవుడ్‌ ప్రాజెక్టుల నుంచి ఆమె వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నింటిపై సమంత ప్రతినిధి స్పష్టత ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. డబ్బు కోసం ఇష్టమొచ్చినట్టు ఏది పడితే అది రాయడం సరికాదన్నారు. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఎవరి ఇష్టానుసారం పనికి రాదని హితవు పలికారు. 

- Advertisement -

‘‘సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె ‘ఖుషి’ షూటింగ్‌లో పాల్గొంటారు. అది పూర్తయిన వెంటనే ఇప్పటికే ఆమె ఒప్పుకొన్న బాలీవుడ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. జనవరి నుంచి సమంత ఒక హిందీ మూవీ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అది సాధ్యపడటం లేదు.

బహుశా ఆ సినిమా షూటింగ్‌ మరో ఆర్నెల్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌, మే నుంచి ఆమె హిందీ మూవీ చిత్రీకరణలో పాల్గొనవచ్చు’’ అని సమంత ప్రతినిధి వివరించారు. సినిమా షూటింగ్‌ కోసం దర్శక-నిర్మాతలను నెలల పాటు వేచి చూసేలా చూడటం మంచి విషయం కాదని ఆమె ప్రతినిధి వివరించారు .

Samantha Photos

‘‘ఎంతో కష్టంతో కూడుకున్న సినిమా షూటింగ్‌ కోసం ఒకరిని వేచి ఉండేలా చేయడం భావ్యం కాదు. ఎందుకంటే ఎంతోమంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒకవేళ వేచి చూడటం సాధ్యం కాకపోతే, వారి షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ చేసుకోమని ఇప్పటికే స్పష్టత ఇచ్చాం.  ఇప్పటివరకూ సమంత ఒప్పుకొన్న ఏ ప్రాజెక్ట్‌ నుంచీ వెళ్లిపోలేదు. అలాగే కొత్త ప్రాజెక్టులను సైతం ఒప్పుకోలేదు. సమంత తర్వాతి సినిమాల విషయంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సమంత ప్రతినిధులు వివరణ ఇచ్చారు.

ఇటీవల సమంత నటించిన ‘యశోద’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరోవైపు గుణశేఖర్‌ దర్శకత్వంలో ఆమె నటించిన ‘శాకుంతలం’ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ దేవరకొండతో కలిసి చేస్తున్న ‘ఖుషి’ చిత్రీకరణలో ఉండగానే సమంత మయోసైటిస్‌తో బాధపడ్డారు. దీంతో సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి, చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం సమంత (Samantha) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here