Veera Simha Reddy : నందమూరి హీరో బాలయ్య కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు..మాస్, యాక్షన్ జొనర్ లో సినిమాలను చేస్తూ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తున్నారు.. ఈ మధ్య మాస్ సినిమాలను చేస్తూ హిట్ టాక్ తో దూసుకు పోతున్నారు. ఇటీవలే అఖండ సినిమాతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకొని రికార్డులు తిరగరాసిన బాలయ్య బాబు.. ఇప్పుడు మరో మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మాస్ అభిమానుల చేత గోల పెట్టించే సత్తా ఉన్న గోపీచంద్ మలినేనితో చేతులు కలిపిన నటసింహం.. వీర సింహారెడ్డి అనే మూవీతో రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి.కాగా, తాజాగా మరో మాస్ సాంగ్ గురించిన అప్‌డేట్ ఇచ్చి హూషారెత్తించారు మేకర్స్. ఈ సినిమా నుంచి మాస్ మొగుడు అనే సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
జనవరి 3న అనగా మంగళవారం రాత్రి 7 గంటల 55 నిమిషాలకు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బాలకృష్ణ, శృతి హాసన్ లుక్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఆడియన్స్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారో అప్పటినుంచే నందమూరి ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించారు మేకర్స్..
బాలయ్య మాస్ ఆంథెమ్ , సుగుణ సుందరి సాంగ్స్ తో పాటు తాజాగా వదిలిన ఈ సాంగ్ సినిమాపై హైప్ పెంచేసింది…మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు..హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్యమైన పాత్రల్లొ కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు..సాంగ్స్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి..సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది..