Dhamaka Review : రాజా ది గ్రేట్ తర్వాత మాస్ మహారాజ రవితేజకు సరైన హిట్ లేదు. అయిన్ హిట్లు ప్లాఫులతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ మాస్ రాజా సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అదే జోష్ లో డబుల్ మాస్ తో ధమాకా క్రియేట్ చేయడానికి ఇవాళ ధమాకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ మాస్ రాజా. మరి ఆ సినిమా ఎలా ఉంది.. మాస్ మహారాజా మరోసారి తన ఊర మాస్ యాటిట్యూడ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడా.. తెలుసు
స్టోరీ ఏంటంటే.. ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేశాడు. స్వామి(రవితేజ) మురికివాడలో నివసించే పేద, ఉద్యోగం లేని ఊరమాస్ యువకుడు. మరోవ్యక్తి ఆనంద్ చక్రవర్తి(రవితేజ) ఓ మల్టీ మిలీనియర్. ఆనంద్ తండ్రి సచిన్ కేడ్కర్ అనారోగ్యంతో తన కంపెనీ బాధ్యతలు ఆనంద్ కు అప్పగిస్తాడు. ఇదే క్రమంలో ఆ కంపెనీని నందగోపాల్(జయరామ్) ఆక్రమించుకోవాలని చూస్తాడు. ఆనంద్ ఆ కంపెనీనీ ఎలా కాపాడతాడు. స్వామికి, ఆనంద్ కు ఉన్న లింకు ఏంటి.. అసలు ఈ మూవీలో శ్రీలీల పాత్ర ఏంటి.. ఈ ఇద్దరిలో ఆమె ఎవరితో ప్రేమలో పడుతుంది.. తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
మూవీ ఎలా ఉందంటే.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకూ అంతా రొటీన్‌గా ఉంటుంది. మాస్ ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా.. ఇప్పటికే ఇలాంటి సినిమాలు చూసి ఉన్నందున ఈ మూవీలో కొత్తదనం ఏం కనిపించదు. ఒక పాయింట్ లో ఇది గౌతమ్ నంద సినిమాను తలపిస్తున్నట్లు అనిపిస్తుంది.
పాత కథను డైరెక్టర్ త్రినాథరావు కనీసం కొత్తగా చూపించడానికి కూడా ప్రయత్నించలేకపోయాడు. ఈ మూవీలో పాటలు బాగున్నాయి. ముఖ్యంగా జింతక్కా చిత్తక్కా పాట ఇప్పటికే చాలా క్రేజ్ సంపాదించుకుంది. మూవీలో బీజీఎం బానే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనంలో మాత్రం కొత్తదనం కరువైనట్లు అనిపిస్తుంది.
యాక్టింగ్ ఎలా ఉందంటే.. మాస్ మహారాజ రవితేజ మరోసారి తన మాస్ మ్యాజిక్ చూపించాడు. మాస్ ప్రేక్షకులకు రవితేజ ఈ మూవీలో చాలా బాగా నచ్చుతాడు. మాస్ మహారాజ రవితేజ నుంచి ఎలాంటి పాత్రలు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారో రవితేజ అలాంటి క్యారెక్టర్ తోనే ఈ సినిమాలో అలరిస్తాడు.
స్వామి పాత్రలో రవితేజ మాస్ అవతార్ థియేటర్లో విజిల్స్ వేయిస్తుంది. మాస్ యాటిట్యూడ్ ఏ కాదు రవితేజ మరోసారి తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీశారు ఈ మూవీలో. శ్రీలీల చాలా అందంగా కనిపించింది. రవితేజ-శ్రీలీల జోడీ ఫ్యాన్స్ కు చాలా నచ్చుతుంది. శ్రీలీల చాలా పరిణితి ఉన్న నటిలా తన నటనతో ఆకట్టుకుంటుంది.
రవితేజకు పోటీగా ఆమె నటన ఉంటుంది. ఇక జయరామ్, సచిన్, తనికెళ్ల భరణి వారి పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన టాలెంట్ ఇంతకు ముందు సినిమాల్లో చూసిందే. డైరెక్షన్ ఎంత బాగా ఉన్నా.. ఆయన తీసుకున్న కథ పాతది కావడంతో ఈ మూవీలో చెప్పుకోదగ్గ విషయాలు ఏం లేనట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ మ్యాజిక్ బాగా పనిచేసిందని చెప్పాలి.
సినిమా : ధమాకా
నటీనటులు : రవితేజ, శ్రీలీల, సచిన్ కేడ్కర్, జయరామ్, తనికెళ్ల భరణి
దర్శకుడు : త్రినాథరావు
నిర్మాతలు : విష్ణు ప్రసాద్, వివేక్
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
కన్ క్లూజన్ : మాస్ ప్రేక్షకులకు మాత్రమే ధమాకా
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
రేటింగ్ : 2/5