Ranjitame : రష్మిక మందన్న ఈ నేషనల్ క్రష్ ఏం చేసినా సెన్సేషనే. ఇక నెట్టింట్లో రష్మికను తలవని మీమర్ ఉండడు. రష్మిక లేని మీమ్, వీడియోస్ ఉండవు. సోషల్ మీడియాకు రష్మిక ఓ ఎవర్గ్రీన్ సోర్స్. ఈ క్యూటీ ముచ్చట్లు, ఫొటోలు ఎప్పుడూ ఫ్యాన్స్‌కి ఇష్టమే. అప్పుడప్పుడు ఈ బ్యూటీ ట్రోలింగ్కి కూడా గురవుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు స్పోర్టివ్‌గానే తీసుకుంటుంది.
ఇక ఈ బ్యూటీ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూ సూపర్ బిజీగా ఉంటోంది. మధ్యమధ్యలో వెకేషన్లకు వెళ్తూ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక బ్రాండ్స్ ఎండార్స్మెంట్స్, సోషల్ మీడియాలో కూడా ఈ భామ చాలా యాక్టివ్. తరచూ సోషల్ మీడియాలో తన ఫొటోస్ పెడుతూ ఫ్యాన్స్‌ను ఖుష్ చేస్తూ ఉంటుంది.
ఎప్పుడూ క్యూట్ క్యూట్‌గా కనిపిస్తూ అంతకంటే క్యూట్‌గా మాట్లాడుతూ రష్మిక నేషనల్ క్రష్ ఇమేజ్ సొంతం చేసుకుంది. కానీ అప్పుడప్పుడు తను చేసే వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా ఈ బ్యూటీ తమిళ్ స్టార్ హీరో విజయ్ సరసన వారిసు అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీకి తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
టాలీవుడ్లో దిల్లున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా సినిమా యూనిట్ ఈ సినిమాలోని ఒక పాటను కూడా రిలీజ్ చేసింది. తమిళ్లో రంజితమే అనే పాటను సినిమా యూనిట్ ఇటీవలే రిలీజ్ చేసింది. యూట్యూబ్‌లో ఈ పాట లక్షల్లో వ్యూస్, వేళల్లో లైకులతో దూసుకుపోతుంది. యూట్యూబ్‌లో ఈ పాట సూపర్ హిట్‌గా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ సాంగ్‌కు ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే.. ఈ పాటను స్వయంగా హీరో విజయ్ పాడారు.
ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ.. ఆ రికార్డులను బ్రేక్ చేస్తోంది రంజితమే సాంగ్. అయినా ఈ పాట సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్‌కు గురవుతోంది. దానికి కారణం ఏంటంటే రష్మిక మందన్న. ఈ పాటలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు రష్మిక కాలికి ఉన్న పట్టి ఊడిపోయింది. ఓ కాలికి పట్టీ ఉండి మరో కాలికి లేకపోవడంతో ఈ పాటను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మూవీ మేకర్స్ కాస్ట్యూమ్స్ మీద కాస్త కూడా శ్రద్ధ తీసుకోలేదంటూ ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో రష్మికను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇప్పటికే కాంతార సినిమా కాంట్రవర్సీ, కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందంటూ రష్మికపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కన్నడ చలన చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందన్న వార్తలపై రష్మిక స్పందించింది. ఆ వార్తల్ని ఖండిస్తూ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది.
“‘కాంతార’ సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిత్రం చూశాక బృందానికి నేను మెసేజ్ పెట్టా. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు కూడా బయటకు రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత” అని రష్మిక వివరించింది.