Singer Sunitha : సినిమాల్లోకి స్టార్ సింగర్ సునీత.. ఏకంగా మహేశ్ బాబుతోనే..

singer sunitha


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు.., గుండు సూది.. గుండు సూది.. గుచ్చుకుంటే తప్పు నాది.., నన్నేదొ సేయ మాకు.. తోట కాడ.., అంటూ తన సూథింగ్ వాయిస్​తో తెలుగు ప్రేక్షకులను మురిపిస్తూ.. మైమరిపిస్తున్నారు గాయని సునీత. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సునీత Singer Sunitha.. తన కల కోసం ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు టాలీవుడ్​లో స్టార్ సింగర్​గా ఎదిగారు. మెలోడీ అనగానే మనకు గుర్తొచ్చే పేరు సునీత. తన మధురమైన గాత్రంతో..శ్రోతలను ఏళ్ల తరబడి లాలిస్తోంది.. తన గాత్ర మాధుర్యంతో అందరి చెవుల్లో తీయదనాన్ని నింపేస్తోంది.

Singer Sunitha
Singer Sunitha

తన మధురమైన స్వరంతో కేవలం పాటలు మాత్రమే కాదు.. చాలా మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెబుతున్నారు సునీత. ఎంతో మంది కథానాయికలకు తన గొంతును సాయమిచ్చి.. వారి కెరీర్​కు సాయపడుతున్నారు. ఓవైపు పాటలు.. మరోవైపు డబ్బింగ్.. ఇంకోవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు సునీత. ఇన్నాళ్లూ తెర వెనుక ఉంటూనే తన గాత్రాన్ని వినిపించిన ఈ కోకిల.. ఇప్పుడు వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యారు.

శ్రావ్యమైన గీతాలకు, తేనె పలుకులకు కేరాఫ్ అడ్రస్​గా నిలిచిన సింగర్ సునీత త్వరలోనే తెలుగు వెండితెరపై సందడి చేయబోతున్నారట. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమ ఫేవరెట్ సింగర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందనే విషయం తెలియగానే చాలా మంది ఫ్యాన్స్ సునీతకు కంగ్రాట్స్ చెప్పారు. ఎంతో కాలంగా ఆమెను తెరపై చూడాలన్న కోరిక ఇప్పటికి నెరవేరిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఆల్ ది బెస్ట్ సునీత గారూ అంటూ సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నారు.

ఎప్పుడు పాటలు, డబ్బింగ్​తో బిజీబిజీగా ఉండే సునీత ఇప్పుడు సినిమాల్లోనూ బిజీ కానున్నారు. ఇన్నాళ్లూ తన గాత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సునీత ఇక నుంచి తన నటనతోనూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారట. ఈమె టాలీవుడ్ వెండితెరపై అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబోలో వస్తున్న సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట సునీత. వీరిద్దరి కాంబినేషన్​లో ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్​తో ఓ సినిమా వస్తోందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్​ బాబుకు అక్క పాత్రలో సునీత నటించనున్నట్లు తెలుస్తోంది.

సునీతను ఆ పాత్రకు తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకున్నారట. వెంటనే తన ఆలోచనను మహేశ్ బాబుకు చెప్పగా ఆయన ఓకే అన్నారట. ఇక సునీతకు కథ వినిపించి ఈ మాట అడిగితే ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సునీత ఫ్యాన్స్ తెగ సంబురపడి పోతున్నారు. ఇప్పటి వరకు తెర మీద కేవలం సునీత గొంతు మాత్రమే విన్న ఫ్యాన్స్.. ఇక నుంచి ఆమెను తెరపై నటిస్తుండటం చూస్తామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ న్యూస్​పై ఇటు త్రివిక్రమ్ టీమ్ కానీ.. అటు సునీత టీమ్​ కానీ అధికారిక ప్రకటన చేయలేదు.

Tags: