Ram Charan తాజాగా మీషోతో ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో తన పర్సనల్ విషయాలను ఎన్నింటినో షేర్ చేసుకున్నాడు. షాపింగ్ చేయడం, గిఫ్టులు ఇవ్వడం, చిన్నప్పటి నుంచి తన స్టైలింగ్‌ను చెప్పడం, ఉపాసన, బన్నీ, తన అక్కాచెల్లెళ్ల గురించి ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. మామూలుగానే తనకు ఆన్ లైన్ షాపింగ్ చేయడం చాలా ఇష్టమని చెర్రీ చెప్పుకొచ్చాడు. ఇక ఇతరులకు గిఫ్టులు ఇవ్వడం అంటే కూడా చాలా ఇష్టమని, అది తన అలవాటని అన్నాడు. తనకు వాచీలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

పటేక్, కేసియో వాచీలంటే ఇష్టమట. ఇక కరోనా టైంలో కేసియో వాచ్‌ను ఆర్డర్ పెట్టాడట. అది ఇంటికి వచ్చినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు వచ్చిన సంతోషం అంతా ఇంతా కాదంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో బాగానే వాచీలున్నాయని తెలిపాడు రామ్ చరణ్. తాను ఎక్కడికి వెళ్లినా చెక్స్ షర్ట్స్ వేసుకుని వెళ్లేవాడిని అని, కానీ తన సిస్టర్స్ అంతా కూడా ఫ్యాషన్ గురించి చెప్పే వాళ్లని, అది వేసుకోమని, ఇది వేసుకోమని చెబుతుండేవారట. తాను చిన్నప్పటి నుంచి అలా కజిన్స్, ఆడవాళ్ల మధ్యే పెరిగానని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లయ్యాక గ్రే, వైట్ ఇలా సింపుల్‌గా షర్ట్స్ వేసుకునే వాడ్ని అంటూ చెప్పుకొచ్చాడు.

ఫ్యాషన్ మార్చమని, తనను మార్చమని ఉపాసన తన ఫ్యాషన్ డిజైనర్ ఫ్రెండ్స్‌తో చెబుతుండేదంటూ రామ్ చరణ్ సీక్రెట్లను బయటపెట్టేశాడు. తనకు ఆన్ లైన్ షాపింగ్ చేయడం ఇష్టమని, తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ ఉండే వస్తువులను వెతుకుతానని చెప్పుకొచ్చాడు. ఆడవాళ్లకి ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలో అబ్బాయిలకు కాస్త సలహాలు ఇవ్వమని రామ్ చరణ్‌ను అడిగాడు. తనకు జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చాడు. తాను ఓ సారి పెళ్లైన కొత్తలో ఉపాసన కోసం ఓ కాస్ట్ లీ గిఫ్ట్‌ను తీసుకున్నాడట. కానీ దాన్ని కనీసం ఐదు సెకన్లు కూడా చూడకుండా పక్కన పడేసిందట. కానీ ఆ వస్తువు కొనడానికి తనకు ఐదు గంటలు పట్టిందని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. అందుకే ఆడవాళ్లకి సర్ ప్రైజ్‌లు ఇవ్వొద్దు.. వారికి కూడా నచ్చవేమో.. ఏదైనా వాళ్లని అడిగి కొంటే బెటర్ అన్నట్టుగా రామ్ చరణ్ సమాధానం ఇచ్చాడు.