Bigg Boss : అన్ని లాంగ్వేజెస్ లో సూపర్ సూపర్ హిట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు మరియు తమిళ్ రెండు భాషల్లో బిగ్ బాస్ షో ఒకేసారి మొదలు పెట్టడం జరిగింది. త్వరలో నాగార్జున హోస్ట్ చేయబోతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ నుంచి బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కంటెస్టెంట్ సెలక్షన్ పూర్తి చేయడం జరిగింది. ఈసారి కంటెస్టెంట్స్ లో కామనర్ కోటాలో ఎంట్రీ ఇవ్వబోతున్న వ్యక్తి షర్మిల.

ఒక సోషల్ మీడియా సెలెబ్రేటీ అయిన షర్మిల లేడీ బస్ డ్రైవర్ గా తమిళనాడు లో బాగా పాపులర్. మామూలుగా మగవాళ్ళు చేసే పని ఆడవాళ్లు చేస్తే వింత విబ్బురంగా ఉండటమే కాకుండా అందరి అటెన్షన్ గ్రాస్ప్ చేస్తుంది. షర్మిల తన కిరాక్ డ్రైవింగ్ వీడియోస్ తో బాగా ఫ్యాన్స్ ని సంపాదించింది. ఈ నేపధ్యంలో ఈమె బస్ లో మామూలు ప్రయనికులే కాదు …ఎంపీ కనిమొళి లాంటి సెలబ్రిటీలు సైతం ట్రావెల్ చేశారు.

అయితే ఈ ప్రయాణం ఆమె జీవితంలో సరి కొత్త మలుపు తీసుకువచ్చింది. అదే బస్ లో ఉన్న లేడీ కండక్టర్ బస్సు ఎక్కిన ఎంపీ కనిమొళి అనుచరుల పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించడం తో బస్ లో చిన్న వివాదం చోటు చేసుకుంది. దీనితో అలిగిన ఎంపీ బస్ అపి దిగి వెళ్లిపోయారు. తన కోసం వచ్చిన ఎంపీ కనిమొళి ని అవమానించి పంపింది అన్న మనస్తాపంతో హర్ట్ అయిన షర్మిల, కండక్టర్ తీరు నచ్చక నెక్స్ట్ స్టాప్ లో బస్ ను వదిలి వెళ్ళిపోయింది.

ఈ చర్య కారణంగా యాజమాన్యం షర్మిలను ఉద్యోగం నుంచి తీసివేయడం జరిగింది. షర్మిల కు పని మీద కంటే పబ్లిసిటీ మీద దృష్టి ఎక్కువైందని వారి అభియోగం. అయితే షర్మిల ఉద్యోగం కోల్పోయిన విషయం తెలుసుకున్న కమల్ హాసన్ ఆమెకు ఒక కారు బహుమతిగా ఇచ్చారు. ఆమెకు డ్రైవర్ గా జీవనోపాధి కల్పించడం తో పాటు ఆమె ఇంకొంతమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదగాలి అని ఆకాంక్షించారు. ఈ ఇష్యూ తర్వాత షర్మిల ఇంకా ఫేమస్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ లేడీ డ్రైవర్ బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈమెను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో కామనర్ కోటా కింద ఎంపిక చేశారని తెలుస్తుంది. ఆగస్ట్ లో గ్రాండ్ గా ప్రారంభం కానున్న తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 లో షర్మిల హల్ చల్ చేయడం తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ కు గట్టి పోటీ ఇస్తుంది అని అందరూ భావిస్తున్నారు.