Bigg Boss నుంచి బయటికి వచ్చిన తర్వాత రాహుల్‌కు అవకాశాలు పెరిగాయి. ఆస్కార్ స్టేజ్ మీద పాడేంత వరకు తన పాపులారిటీ వెళ్లిపోయింది. అయినా కూడా బిగ్ బాస్ తనకు ఇచ్చిన ఫేమ్‌ను రాహుల్ మర్చిపోలేదు. అందుకే ఇంకా బిగ్ బాస్‌ను ఫాలో అవుతున్నాడని తన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తే అర్థమవుతోంది.
అయితే, అతడి పోస్ట్ ‘బిగ్ బాస్’ గురించి కాదు. అందులోని కంటెస్టెంట్ రతిక గురించి అని తెలుస్తోంది. గత కొద్ది రోెజులుగా సోషల్ మీడియాలో ట్రెండవ్వుతోన్న రతిక, రాహుల్ సిప్లిగంజ్ ఫొటోలపై పరోక్షంగా స్పందించినట్లు టాక్. ‘‘ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? జనాలు ఎప్పుడూ తమ సొంత టాలెంట్‌ను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఎప్పుడూ ఇతరుల పేరు, టాలెంట్‌పైనే ఆధారపడుతుంటారు. అదే విషయాన్ని కొందరు నిరూపిస్తారు కూడా. ఫేమ్ కోసం అవసరం కంటే ఎక్కువ వాడుకుంటారు.
నీలోని మనిషికి ఆల్ ది బెస్ట్. డబ్బులు తీసుకున్న టీమ్‌కు కంగ్రాట్స్’’ అని రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేశాడు. రాహుల్ పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లో రతిక చేసిన కామెంట్స్‌కు కౌంటర్ అని నెటిజన్స్ అంటున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి రతిక గేమ్ ప్లాన్ చాలా డిఫరెంట్‌గా ఉందని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు.