Bigg Boss Telugu :రతిక-యావర్ రొమాన్స్.. అమర్​దీప్​పై శివాజీ ఫుల్ ఫైర్.. ఇంట్రెస్టింగ్​గా బిగ్​బాస్-7 లేటెస్ట్ ప్రోమో

- Advertisement -

బిగ్​బాస్ తెలుగు సీజన్-7 మొదలై రెండు వారాలు పూర్తయి మూడో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం రోజున నామినేషన్లు పూర్తయ్యాయి. నామినేషన్ తర్వాత నుంచి హౌజ్​లో ఇంట్రెస్టింగ్​ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం నామినేషన్లలో యావర్​ను రతిక నామినేట్ చేసింది. అయితే ఈ ప్రోమోలో మాత్రం ఆ ఇద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. కేవలం కలిసిపోవడమే కాదు.. యావర్ రతికకు బహిరంగంగానే లైన్ వేస్తున్నాడు. అది చూసిన పల్లవి ప్రశాంత్ ఈ సరసాలేంట్రా బాబు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ ట్రయాంగిల్ ఫ్లర్టేషన్ బిగ్​బాస్​ హౌజ్​పై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్​ని కలిగిస్తోంది. అసలేం జరిగిందంటే..?

ఈ ప్రోమోలో కిచెన్​లో రతిక, యావర్​ మరో ఇద్దరు కంటెస్టులు ఉన్నారు. ఈ సందర్భంగా యావర్ తనకు తెలుగు రాదంటూ కంటెస్టెంట్లు పదే పదే అనడంపై.. నామినేషన్లకు కూడా అదే రీజన్ చెప్పడంపై తీవ్రంగా ఫైర్ అయ్యాడు. ఆ క్షణం యావర్ చాలా కోపంగా కనిపించాడు. కానీ మరుక్షణమే రతిక వైపు తిరిగి.. రతిక నేను నీకున్నానంటూ చెప్పాడు. ఈ క్రమంలో.. ఆ ఇద్దరి మధ్య చూపులు.. రొమాన్స్​ను హౌజ్​మేట్స్ చూసి షాక్ అయ్యారు.

మరోవైపు యావర్ రతికకు అన్నం తినిపించడం.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్​లో తినడం చూసి హౌజ్​మేట్స్ ఆశ్చర్యపోయారు. దీనిపై దామిని అండ్ గ్యాంగ్ కాస్త గట్టిగానే రియాక్ట్ అయింది. దామిని గౌతమ్​తో మాట్లాడుతూ.. హేయ్ గౌతమ్ నెక్స్ట్ నామినేషన్​లో నేను నిన్ను నామినేట్ చేస్తా.. తర్వాత మనిద్దరం కలిసి ఒకే ప్లేట్​లో తిందాం అంటూ గౌతమ్​ను ఆటపట్టిస్తూనే.. రతిక ప్రవర్తనను ఇమిటేట్ చేసింది.

- Advertisement -
Shivaji

ఇక ప్రోమో వీడియోలో చివరన శివాజీ ఎవరిమీదో ఫైర్ అవుతూ కనిపించాడు. ఇంతకుముందు కాఫీ కోసం బిగ్​బాస్​తో కలిసి ప్రాంక్ చేసిన శివాజీ ఈసారి కూడా ప్రాంక్ చేస్తున్నాడా లేదా నిజంగానే కోపంగా ఉన్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే శివాజీ అరవడం.. ఆ తర్వాత అమర్​దీప్ శివాజీ మాట్లాడిన దానిపై ప్రియాంకాతో మాట్లాడటం చూస్తుంటే.. శివాజీకి కోపం తెప్పించే పనేదో అమర్​దీప్ చేశాడని అనిపిస్తోంది. మరి అమర్​దీప్​కు బిగ్​బాస్ సీక్రెట్ టాస్కు ఏదైనా ఇచ్చాడేమో అని నెటిజన్లు అనుకుంటున్నారు.

ఏదైమైనా ఇవాళ్టి ఎపిసోడ్ ఫుల్ ఫన్ తెప్పించేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు రతిక-యావర్ రొమాన్స్.. ఇంకోవైపు రతిక-పల్లవి ప్రశాంత్-యావర్ ట్రయాంగిల్ ఫ్లర్టేషన్.. మరోవైపు శివాజీ వర్సెస్ అమర్​దీప్.. ఇదంతా చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ అద్దిరిపోతుందని బిగ్​బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరి ఇవాళ రాత్రి వరకు వేచి చూడాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here