R Narayana Murthy డబ్బులు ఆశించకుండా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ, వారిలో సమాజం పట్ల ఉత్తేజం, స్ఫూర్తిని నింపుతూ సినిమాలు తీసే కళాకారులు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఆర్ నారాయణమూర్తి. తెలంగాణ నేపథ్యం లో ఈయన ఎన్నో పోరాటభరితమైన సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. వాటిలో కొన్ని కమర్షియల్ గా భారీ సక్సెస్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ కూడా ఆయన తన పంథాని మార్చలేదు. అదే తరహా చైతన్య భరితమైన సినిమాలను తీస్తూ వచ్చారు. అలాంటి ఉన్నత ఆశయాలు కలిగిన ఆర్ నారాయణమూర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.
కాసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. అసలు నారాయణమూర్తికి ఏమైంది, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏమిటి అనేదానిపై పూర్తి స్థాయి సమాచారం లేదు. కానీ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎల్లప్పుడూ చలాకీగా మాట్లాడుతూ, మీడియా ముందుకు కనిపించే నారాయణమూర్తికి ఇలా ఆసుపత్రి పాలవ్వడం నిజంగా దురదృష్టకరమే. సంపాదించిన డబ్బుతో భోగభాగ్యాలు అనుభవించగల సుఖం ఆయనకీ ఉంది. కానీ ఈనాడు కూడా ఆ మార్గం ని ఎంచుకోలేదు.
చాలా సాధారణమైన జీవితాన్ని బ్రతుకుతూ, నలుగురికి సహాయం చేస్తూ ఇండస్ట్రీ బాగుపడాలి అని తాపత్రయం పడే అరుదైన వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాం. ఇకపోతే ఆర్ నారాయణమూర్తి చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం రైతన్న. 2021 లో ఆయన స్వీయ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం మంచి రివ్యూస్ ని అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసాడు. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు సినిమాల్లో ఆయనకీ పవర్ ఫుల్ రోల్స్ ఆఫర్స్ వచ్చినా కూడా ఎందుకో ఆయన చేసేందుకు అంగీకరించలేదు. భవిష్యత్తులో అయినా ఆయన పవర్ ఫుల్ రోల్స్ లో కనిపిస్తారో లేదో చూడాలి.