Naveen Polishetty చిన్న చిన్న పాత్రల ద్వారా పాపులారిటీ ని దక్కించుకొని, ఆ తర్వాత హీరో గా సక్సెస్ లు అందుకొని నేడు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా పేరు తెచ్చుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. ఇప్పటి వరకు ఈయన హీరోగా మూడు సినిమాలు చేస్తే, మూడు కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కేవలం హిట్స్ అవ్వడం మాత్రమే కాదు, నవీన్ పోలిశెట్టి కి ఒక నటుడిగా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ కి ఫ్యాన్ కానీ వాడంటూ ఎవ్వరు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకోవడం అలవాటు ఉన్న నవీన్ పోలిశెట్టి ఇప్పుడు సినిమాలకు మరింత గ్యాప్ ఇవ్వనున్నాడు.
రీసెంట్ గా ఆయన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టుని పెడుతూ ‘నాకు ఇటీవలే ఒక యాక్సిడెంట్ జరిగింది. శరీరం లో చాలా గాయాలు అయ్యాయి. మీరు నా సినిమాల మీద చూపించిన ప్రేమకి రెట్టింపు ఉత్సాహం తో మరిన్ని సినిమాలు చెయ్యాలని ఉంది. కానీ ఇలా దెబ్బలతో కాదు, పూర్తి స్థాయి ఎనర్జీ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు’ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్ తో ఒక సినిమా, అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో మరో సినిమా, ఇలా వరుసగా మూడు సినిమాల్లో హీరోగా చెయ్యడానికి ఒప్పుకున్నాడు.
కెరీర్ లో ఇలా దూసుకుపోతున్న ఈ సమయం లో ఆయనకీ ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఆయన ఇంస్టాగ్రామ్ పోస్టు క్రింద ప్రతీ ఒక్కరు గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ చేస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ వెళ్తే స్టార్ హీరో గా ఎదిగేందుకు అన్నీ విధాలుగా అర్హతలు ఉన్న వ్యక్తి, నేటి తరం చిరంజీవి అంటూ నవీన్ పోలిశెట్టి ని పొగడ్తలతో ముంచి ఎతుంటారు ప్రేక్షకులు. గత ఏడాది ఆయన హీరోగా నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఆయన్ని వెండితెర మీద చూసేది వచ్చే ఏడాదే అని ఖరారు కావడంతో అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.