Prabhas – Samantha : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన రూమర్స్ కనిపిస్తూనే ఉంటుంది..క్వాలిటీ తో కూడిన వార్తలను నెటిజెన్స్ చదివి చాలా కాలమే అయ్యింది..ఎప్పుడు చూసినా రూమర్స్ కి కేంద్ర నిలయం గా మారిపోయింది సోషల్ మీడియా..కానీ కొన్ని కొన్ని సార్లు రూమర్స్ అనుకున్నవి కూడా నిజమైన సందర్భాలు చాలానే ఉన్నాయి..దీనితో నెటిజెన్స్ కి ఏది రూమర్..ఏది నిజం అనేది తెలియట్లేదు.

రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక వార్త అందరినీ షాక్ కి గురి చేసింది..అదేమిటి అంటే నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత గురించి సోషల్ మీడియా లో వచ్చినన్ని కథనాలు మరియు రూమర్స్ బహుశా ఇండియా లో ఎవరి మీద వచ్చి ఉండవు..ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా లో ఒక కథనం ప్రచారమైంది.

ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని సంఘటనకి సంబంధించిన వార్త కావడంతో సోషల్ మీడియా లో నిమిషాల వ్యవధి లోనే వైరల్ అయ్యింది.. విషయం ప్రభాస్ దాకా వెళ్ళింది.. ఈ వార్తలను చూసిన ప్రభాస్ చాలా తీవ్రమైన అసహనం కి గురయ్యాడట..ఎప్పుడు మిస్టర్ కూల్ యాటిట్యూడ్ తో ఉండే ప్రభాస్ లో ఇంత ఆవేశం చూసేసరికి ఆయన అసిస్టెంట్స్ అందరూ భయపడిపోయారు..వెంటనే ఆ కథనం ప్రచురించిన వెబ్ సైట్ పై కఠిన చర్యలు తీసుకునేలా చేసాడు.

ఈ విషయం సమంత దాకా రీచ్ అయ్యిందో లేదో తెలియదు కానీ, ఒకవేళ రీచ్ అయితే మాత్రం ఆమె రియాక్షన్ కూడా ఇలాగే ఉంటుందని చెప్పొచ్చు.. సమంత టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించింది కానీ ఒక్క ప్రభాస్ తో మాత్రం ఇప్పటి వరకు ఆమె నటించలేదు.. కనీసం వీళ్లిద్దరి మధ్య పరిచయమైనా అయ్యి ఉంటుందో లేదో అనుమానమే.. అలాంటిది వీళ్లిద్దరి మధ్య ఇలాంటి రూమర్స్ రావడం హాస్యాస్పదం అని విశ్లేషకులు అంటున్నారు.
