Pooja Hegde : రెడ్ శారీలో బుట్టబొమ్మ.. పూజా హెగ్డే హాట్​లుక్స్​తో కుర్రాళ్లు ఫిదా

- Advertisement -

పూజా హెగ్డే Pooja Hegde .. ఈ బుట్టబొమ్మ టాలీవుడ్​, బాలీవుడ్, కోలీవుడ్​లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. స్టార్ హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా స్టార్​గా గుర్తింపు పొందింది. ఒక లైలా కోసం మూవీతో తెలుగు తెరకు పరిచయమైన పూజ.. ఆ తర్వాత వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్​గా ఎదిగింది.

Pooja Hegde
Pooja Hegde

పూజా హెగ్డేకు ప్రస్తుతం టాలీవుడ్, పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి. నంబర్ వన్ హీరోయిన్​గా రాణిస్తున్న ఈ బుట్టబొమ్మకు 2022 ఏడాది మాత్రం ఏం కలిసి రాలేదు. ప్రభాస్​తో ‘రాధే శ్యామ్’ సినిమాతో పూజాకు బ్యాడ్ టైమ్ మొదలైంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

Pooja Hegde Red Saree Photos
Puja Hegde

బీస్ట్ మూవీతో తన ఫ్లాప్ ఖాతా క్లోజ్ అవుతుందని భావించిన ఈ భామకు విజయ్ కూడా బ్యాడ్​లక్​గా మారాడు. ఈ సినిమాలో హల్మతి హబీబ సాంగ్ సూపర్ హిట్ అయినా మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పూజా కెరీర్ కాస్త డల్​గా మారింది. అయినా ఈ బ్యూటీకి ఆఫర్లకు కొదవేం లేదు.

- Advertisement -
Pooja Hegde Red Saree Images
Puja Hegde

టాలీవుడ్, బాలీవుడ్​లలో వరుస అవకాశాలు వస్తున్నాయి.ఏదేమైనా పూజ మాత్రం త్రివిక్రమ్​కు బాగా కలిసొచ్చిన హీరోయిన్. అందుకే త్రివిక్రమ్ పూజను రిపీట్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం మహేశ్​బాబుతో కలిసి చేస్తున్న మూవీలో పూజకు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు ఈ మాటలమాంత్రికుడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది.

Pooja Hegde Red saree images
Puja Hegde

టాలీవుడ్​లో కలిసి రాకపోయినా పూజకు బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్​కమ్ చెబుతోంది. రీసెంట్​గా రణ్​వీర్​సింగ్​తో కలిసి సర్కస్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2022 కలిసి రాకపోయినా ఆఫర్లతో దూసుకెళ్లిన పూజకు 2023 ఎలా ఉండబోతోందోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కనీసం వచ్చే ఏడాదైనా ఈ బుట్టబొమ్మ ఖాతాలో అరడజను బాక్సాఫీస్ బ్లాక్​బస్టర్లు పడాలని కోరుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here