Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా 5 ప్రధాన మంత్రిత్వ శాఖలకు బాధ్యతలు వ్యవహరిస్తూ పాలనలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఇక మీదట సినిమాలు చేస్తాడా, లేదా అనే సందేహాలు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కలిగేవి. ఇదే విషయాన్నీ పిఠాపురం సభలో అభిమానులు అడగగా, మూడు నెలల తర్వాత వారానికి రెండు మూడు రోజులు షూటిం చేస్తానని నా నిర్మాతలకు చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఇంకా ముందే ఆయన షూటింగ్స్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ లో బలమైన టాక్ వినిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన వచ్చే నెల నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నారట.
నిన్న ఈ విషయాన్నీ చర్చించేందుకే తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో విజయవాడ లో తన క్యాంపు ఆఫీస్ లో భేటీ అయ్యాడు. తన రాజకీయ కార్యక్రమాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఒప్పుకున్నా మూడు సినిమా షూటింగ్స్ కి సంబంధించిన కాల్ షీట్స్ ఎలా ఇవ్వాలి అనే దానిపై నిన్న చర్చలు జరిపాడట. ఆగస్టు నెలలో ఆయన ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుమారు 80 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు భారీ రేట్ కి కొనుగోలు చేసారు.
ముందు అనుకున్న డీల్ ప్రకారం, ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అక్టోబర్ లోపు విడుదల చేయాలట. లేని పక్షం లో నిర్మాత అమెజాన్ ప్రైమ్ సంస్థ కి తీసుకున్న డబ్బులు మొత్తం వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నిర్మాత పడుతున్న ఈ ఇబ్బందిని గమనించిన పవన్ కళ్యాణ్ ముందుగా హరి హర వీరమల్లు సినిమాకి డేట్స్ ఇచ్చాడట. ఆగష్టు మూడవ వారం నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను కూడా సగానికి పైగా పూర్తి చేసాడు. వీటిల్లో ఓజీ చిత్రాన్ని కూడా ఈ ఏడాదే పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ కూడా అధికారికంగా రానుంది.