Devara : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉన్నంత ఓపిక, సహనం టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఎన్టీఆర్ సోలో హీరో గా నటించిన చివరి చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమా విడుదలై దాదాపుగా ఆరేళ్ళు కావొస్తుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుండి సోలో హీరో గా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. #RRR చిత్రం వచ్చినప్పటికీ కూడా అత్యధిక క్రెడిట్స్ రామ్ చరణ్ కి వెళ్లాయి. ఎన్టీఆర్ పాత్ర సపోర్టింగ్ రోల్ లాగ ఉందంటూ ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అభిమానులు ఈ విషయం పై ఎన్నోసార్లు అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సోలో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం ఉంది.
అందుకే వాళ్లంతా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర‘ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. తొలుత ఏప్రిల్ 4 వ తేదీన విడుదల చేస్తామని చెప్పారు, కానీ షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో కుదర్లేదు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని అక్టోబర్ 11 న విడుదల చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం వాయిదా పడడంతో మళ్ళీ సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చేస్తామని అధికారిక ప్రకటన చేసారు. కచ్చితంగా ఆ తేదీన విడుదల అవుతుంది అనుకున్న అభిమానులకు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ కంగుతినేలా చేసింది.
సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉండడం, పలు సన్నివేశాలను కచ్చితంగా రీ షూట్ చెయ్యాల్సిన అవసరం ఉండడంతో సెప్టెంబర్ 27 వ తారీఖున ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ అని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. అదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ బలికాక తప్పదు. ఆరేళ్ళ నుండి తమ అభిమాన హీరో సోలో చిత్రం కోసం ఎదురు చూస్తున్నామని, కానీ అది అందని ద్రాక్ష లాగ ముందుకు జరుగుతూ పోతుందని, కనీసం 2025 లో అయినా విడుదల అవుతుందా అని అభిమానులు ఆ చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, మరియు పాటకు ఫ్యాన్స్ నుండే కాకుండా ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వారం లో రెండవ పాట కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట.