Mrunal Thakur :హీరోయిన్ల రెమ్యూనరేషన్ దాన్ని చూసే డిసైడ్ చేస్తారు.. సీతారామం బ్యూటీ కామెంట్స్



సీతారామం సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది మృణాల్ ఠాకూర్ Mrunal Thakur . సీతగా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోయేలా తన పాత్రలో లీనమైపోయింది. సీత పాత్రలో మృణాల్​ను తప్ప మరెవర్నీ ఊహించుకోలేనంతగా తన నటనతో ఫిదా చేసింది. ఒక్క సినిమాతోనే సూపర్​గా పాపులర్ అయింది ఈ బ్యూటీ.

Mrunal thakur new photos
Mrunal thakur

సీత పాత్రలో ఎంతో అణకువగా కనిపించినా.. నిజ జీవితంలో మాత్రం మృణాల్ చాలా డిఫరెంట్. ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేయడం ఈ బ్యూటీకి అలవాటు. మనసులో ఏముందో అదే నోటిపై ఉంటుంది. ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన ఓ చర్చకు అతిథిగా వెళ్లింది ఈ భామ. ఆ చర్చలో భాగంగా హీరోయిన్ల రెమ్యునరేషన్​ గురించి ఈ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్లు చేసింది.

Mrunal Thakur
Mrunal thakur

‘హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ విషయంలో కచ్చితంగా వ్యవహరించాలి. ప్రేక్షకుల్లో మనకున్న ఇమేజ్​ను బట్టే రెమ్యునరేషన్ డిసైడ్ చేస్తారు నిర్మాతలు. అయితే చాలా మంది హీరోయిన్లు తాము కోరుకున్నంత డిమాండ్ చేసే విషయంలో కచ్చితంగా ఉండరు. అయోమయంలో ఉండటం వల్ల చాలా నష్టపోతున్నారు. రెమ్యునరేషన్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్​గా ఉన్నామో అర్థమవుతుంది.’ అని మృణాల్ చెప్పుకొచ్చింది.

Mrunal thakur Stills
Mrunal thakur

సీతారామం సినిమాతో ఇప్పటికే మృణాల్ తన డిమాండ్ పెంచేసింది. రెమ్యునరేషన్ విషయంలో మృణాల్ ప్రస్తుతం కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందని సమాచారం. సీతారామం సినిమా హిట్టుతో ఈ భామకు వరుసగా సినిమా అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్​లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ సీతారామం మూవీతో టాలీవుడ్​లోనూ భలే ఆఫర్లు కొట్టేసింది.

Mrunal thakur Photos
Mrunal thakur

టెలివిజన్ తెరపై సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్.. మరాఠి సినిమా ‘విట్టి దండు’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మరాఠీతో పాటు హిందీ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘లవ్ సోనియా’ అనే మూవీతో బాలీవుడ్​లో అడుగుపెట్టింది ఈ భామ. ఆ తర్వా త హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’లో యాక్ట్ చేసింది. ఇందులో తన నటనతో మెప్పించింది. అలా బాలీవుడ్​ నుంచి నెమ్మదిగా తన ప్రయాణం టాలీవుడ్​ వైపునకు సాగింది.