Sitara స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. రాజమౌళి సహాయం లేకుండా కేవలం తన సొంత టాలెంట్ తో పాన్ ఇండియా రేంజ్ లో జెండా పాతిన మొట్టమొదటి తెలుగు హీరో అల్లు అర్జున్. ఇప్పుడు మన టాలీవుడ్ నుండి ఇతర భాషల్లో బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకున్న ఏకైక హీరో కూడా అల్లు అర్జున్ మాత్రమే.

బాలీవుడ్ లో అయితే ఆయనకీ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది, అలాగే కోలీవుడ్ లో,మాలీవుడ్ లో, శాండిల్ వుడ్ లో కూడా ఆయనకీ క్రేజ్ వచ్చేసింది. ఒక్క రాజమౌళి కి తప్ప ఇప్పటి వరకు ఎవరికీ ఇలాంటి అదృష్టం దొరకలేదు. హీరోలలో అల్లు అర్జున్ కి ఆ అదృష్టం దొరికింది. ప్రస్తుతం ఆయన హీరో గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.

ఇదంతా పక్కన పెడితే పుష్ప సినిమాలో ‘తగ్గేదేలే’ అనే మ్యానరిజం ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. చిన్న పిల్లల దగ్గ్గర నుండి పండు ముసలోళ్ల వరకు ప్రతీ ఒక్కరు ఈ మ్యానరిజం ని అనుకరించేవాళ్ళు. ఇక సెలబ్రిటీస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వారుకు ప్రతీ ఒక్కరికి తగ్గేదేలే అనే మ్యానరిజం అలవాటు అయిపోయింది.

చివరికి క్రికెటర్స్ , ఫుట్ బాల్ ప్లేయర్స్ కూడా ఈ మ్యానరిజం ని తెగ ఫాలో అయ్యేవారు. రీసెంట్ గా ఆ జాబితాలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా చేరిపోయింది. ఈమె తగ్గేదేలే అంటూ విమానం లో కూర్చున్న సమయం లో ఫోటోలకు ఫోజు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసిన ఈ ఫోటోనే కనిపిస్తుంది. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నిజంగా ఎంతో గర్వకారణమైనది అనే చెప్పాలి.
