Trisha : తమిళ నటి త్రిష కృష్ణన్ పేరు చెప్పగానే అందరికీ ఆమె నటించిన ఎన్నో అద్భుతమైన సినిమాలు గుర్తుకు వస్తాయి. 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇప్పటికీ చెరిగిపోని అందంతో పదహారేళ్ల అమ్మాయిలా తన ఫోటోలతో ఎప్పటికప్పుడు అభిమానులకు అందాల విందు చేస్తూనే ఉంటుంది. అలాంటి త్రిష ఇప్పటికే చాలామంది హీరోలతో ప్రేమాయణం సాగించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అన్నట్లుగా త్రిష ఎంత మంది హీరోలతో తిరిగినప్పటికీ కూడా పెళ్లి మాత్రం బిజినెస్ మాన్ అయినా వరుణ్ మానియన్ ని చేసుకోవాలనుకుంది. అయితే వీరి మధ్య కొన్ని రోజులు లవ్ ట్రాక్ నడిచి అది కాస్త పెళ్లి వరకు దారి తీయడంతో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరూ తమ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకొని పెళ్లికి స్వస్తి చెప్పారు. అయితే వీరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడానికి అప్పట్లో అనేక రకాల ఊహాగానాలు తెరమీద వినిపించాయి.

అయితే త్రిష పెళ్లి పెటాకులు అవడంతో ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో తన స్నేహితులందరికీ పిలిచి పెద్ద పార్టీ ఇచ్చాడట.అంతేకాదు అందర్నీ ప్రేమించి మోసం చేసే దానికి అలాంటి గతే పట్టాలి అని తిట్టుకుంటూ తన ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చి తెగ ఎంజాయ్ చేశాడట. ఇక అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొట్టింది.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటుడు ప్రభాస్ తో పెళ్లి వరకు వెళ్లిందని,ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా లవ్ ట్రాక్ సాగించిందని వార్తలు వచ్చాయి. ఇక వీళ్లిద్దరే కాకుండా టాలీవుడ్ హీరో రానా అలాగే కోలీవుడ్ లో నటించే టైంలో శింబు , ధనుష్ తో కూడా ఈ హీరోయిన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగిందని కొన్ని రోజులు ఈ హీరోలతో డేటింగ్ కూడా చేసిందని వార్తలు వినిపించాయి.