Lavanya – Varun Tej మెగా ఫ్యామిలీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో గా పేరు తెచ్చుకున్న నటులలో ఒకరు వరుణ్ తేజ్. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనం, వైవిద్యం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం కొన్ని సక్సెస్ లు వచ్చాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఆయనకీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. ఇటీవలే ఆయన ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా ప్రేమించుకుంటూ డేటింగ్ చేసిన ఈ జంట ఒక్కటైనా తర్వాత వరుణ్ తేజ్ నుండి వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన కరుణ కుమార్ అనే దర్శకుడితో మట్కా అనే చిత్రం లో నటిస్తున్నాడు.
ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటు ఆయన మరో రెండు సినిమాలకు సంతకం చేసాడు. అందులో మేర్లపాక గాంధీ దర్శకత్వం, ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మాతగా మారి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కిస్తున్న సినిమా మరొకటి. కథ రీత్యా ఈ చిత్రం షూటింగ్ అధిక శాతం కొరియా లో జరగనుంది. సెప్టెంబర్ చివరి వారం లో ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించి, కేవలం ఒకే షెడ్యూల్ లో అత్యధికంగా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
అంటే కొన్ని నెలల పాటు వరుణ్ తేజ్ హైదరాబాద్ కి , తన కుటుంబం కి, తన భార్య లావణ్య త్రిపాఠికి దూరంగా వెళ్లనున్నాడు అన్నమాట. షూటింగ్స్ గ్యాప్ మధ్యలో అత్యధికంగా తన భార్య లావణ్య త్రిపాఠి తో కలిసి ఫారిన్ ట్రిప్పులకు వెళ్లే వరుణ్ తేజ్, అధిక శాతం లావణ్య తో గడిపేందుకు సమస్యం కేటాయించేవాడు. కానీ ఇప్పుడు ఆమెకి దూరంగా కొంతకాలం ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. లావణ్య ని కూడా వరుణ్ తేజ్ తన వెంట తీసుకొని వెళ్లొచ్చు, కానీ ఆమె కూడా పలు చిత్రాలకు సంతకం చేసింది. వచ్చే నెల నుండి ఆమె కూడా షూటింగ్స్ తో ఫుల్ బిజీ కానుంది. కాబట్టి ఇలాంటి సమయం లో వీళ్లిద్దరికీ కొంతకాలం దూరంగా ఉండక తప్పదు అని ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తున్న వార్త.