Varun Tej : వరుణ్ తేజ్ నిర్ణయంతో మూడు ముక్కలు కానున్న మెగా ఫ్యామిలీ

- Advertisement -

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలె ఆయన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. హీరో వరుణ్ తేజ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇటీవల ఒక వార్త బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వార్త గురించి తెలుసుకున్న మెగాభిమానులు షాక్ అయిపోతున్నారు. వరుణ్ తేజ్ అభిమానులు మాత్రం చాలా కూల్‎గా లైట్‎గా ఈ విషయాన్ని సింపుల్ గా కొట్టి పడేస్తున్నారు. మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టబోతున్నారట.

ఇప్పటికే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. ఆయనతో పాటు నిహారిక అల్రెడీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఆడపిల్లలు వేరు అలా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అయితే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన అన్నదమ్ములు ఒకే పేరిట ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే అది పెద్ద రాద్ధాంతం అవుతుంది. మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించింది అయితే రచ్చ రచ్చ చేసేస్తారు నెటిజన్లు.

- Advertisement -

ప్రస్తుతం అదే న్యూస్ వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారట. ఈ విషయంలో మెగా ఫ్యామిలీలో ఇష్యూస్ కూడా వచ్చాయట. అయినా సరే లావణ్య వరుణ్ తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారట. కొణిదెల పేరుతో మరొక ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టబోతున్నారట. దీంతో వరుణ్ తేజ్ అన్నకు పోటీగా ఈ పని చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. మరికొందరు లైఫ్‎లో సెటిల్ అవ్వడానికి ఎవరి దారి వారు చూసుకుంటారు. ప్రతిదీ రాద్ధాంతం చేస్తే ఎలా అంటూ వరుణ్ కి సపోర్ట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here