Kriti Sanon బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. మహేష్ బాబు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ అమ్మడు నటనకు ఫిదా అయ్యారు.. ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దాంతో తెలుగులో అవకాశాలు అందని ద్రాక్షలాగా మారాయి.. బాలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్స్ తో బిజీగా గడుపుతుంది.. తాజాగా ఈ అమ్మడు ఖరీదైన లగ్జరి ఇంటిని కొనుగోలు చేసింది.. దాని ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది..
ఈ అమ్మడు అతి కొద్ది ప్రముఖులకు మాత్రమే సాధ్యమైన ఓ చాలా విలువైన ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖులు మాత్రమే కొన్న ప్రాంతంలో ఖరీదైన బంగ్లాను సొంతం చేసుకుంది.. ముంబైలోని అలీబాగ్‌లో బీచ్ ఒడ్డున అభినందన్ లోధా వెంచర్‌లో 2000 sq ft లగ్జరీ స్టలాన్ని కొనుగోలు చేసింది. దాని విలువ రూ. 2 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.. అంతగా డబ్బులను సంపాదిస్తుందా అని కొందరు విమర్శకులు కామెంట్ చేస్తున్నారు..
సినిమాల విషయానికొస్తే.. తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా, క్రూ, వంటి సినిమాలు ఇప్పటికే విడుదలై వంద కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం మరో మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.. ఇక ఒకదాని తర్వాత మరోటి అవకాశాలు దక్కించుకుంటూ ఆగ్ర కథానాయికల లిస్టులో చేరింది. మిగతా ఏ నటికి లేనన్ని అవకాశాలతో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేని ఈ అమ్మడు హిందీలో మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది..