నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు
కథ, దర్శకత్వం: ఎస్.శంకర్
నిర్మాత: సుభాస్కరన్
స్క్రీన్ ప్లే: ఎస్.శంకర్, బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్
మ్యూజిక్ : అనిరుద్ రవిచంద్రన్
సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన భారతీయుడు(ఇండియన్) చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కల్ట్ క్లాసిక్ గా ఎలా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసినా కూడా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మూడు దశాబ్దాల క్రితమే శంకర్ నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా, ఎంతో అడ్వాన్స్ గా ఈ చిత్రాన్ని తీశారు. అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే కచ్చితంగా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడంలో భారతీయుడు 2 చిత్రం మొదటి నుండి విఫలం అవుతూ వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ మీద ఉన్న నమ్మకం తో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం.
కథ :
సమాజం లో జరిగే అన్యాయాలకు స్పందించే మనస్తత్వం ఉన్న వ్యక్తి సిద్దార్థ్. అతను తన నలుగురి టీం తో కలిసి లంచం తీసుకుంటున్న అధికారులకు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇతని వల్ల సమస్యలు ఎదురుకునే అధికారులు సిద్దార్థ్ ని అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలాంటి దుర్మార్గుల ఆటలను అరికట్టడానికి సేనాపతి తిరిగి వస్తే బాగుంటుంది అని అనుకుంటాడు సిద్దార్థ్. సేనాపతి తిరిగి రావడం కోసం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాడు. ఇది సేనాపతి వరకు చేరడం తో ఆయన ఇండియా కి తిరిగి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్నా ఈ అన్యాయాలను అరికట్టే క్రమంలో అక్రమాలు చేస్తున్న ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైనా సవాళ్లు ఏంటి?, పోలీసులకు సేనాపతి దొరికిపోతాడా లేదా తప్పించుకుంటాడా అనేది స్టోరీ.
విశ్లేషణ:
ఒక కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాం అంటే, కచ్చితంగా ప్రేక్షకుల్లో అంచనాలు మొదటి భాగం లో ఉన్న స్టాండర్డ్స్ కి తగ్గట్టుగానే ఉంటాయి. కానీ భారతీయుడు 2 చిత్రం టేకింగ్ పరంగా శంకర్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేసాడు కానీ, ఎమోషనల్ గా తియ్యడం లో మాత్రం విఫలం అయ్యాడు. శంకర్ అంటే ఎమోషనల్ సన్నివేశాలు తియ్యడం లో సిద్ద హస్తుడు అనే పేరుంది. భారతీయుడు చిత్రం అన్నీ క్రాఫ్ట్స్ లో శబాష్ అనిపించేలా తెరకెక్కించాడు శంకర్. కానీ ఇక్కడ భారతీయుడు 2 లో కంటెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ అనే విధంగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఎదో సాగిపోతుంది పర్వాలేదు అని అనిపించేలా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో అనేక సన్నివేశాలు ఆడియన్స్ కి చిరాకు కలిగించేలా ఉంటాయి. కేవలం చివరి 20 నిమిషాలు ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చెయ్యడం లో శంకర్ సక్సెస్ అయ్యాడు. అలాగే చివర్లో వచ్చిన ఇండియన్ 3 ట్రైలర్ అద్భుతంగా ఉంటుంది. సినిమాలో మెయిన్ కంటెంట్ మొత్తం ఇండియన్ 3 లోనే పెట్టినట్టుగా ఆడియన్స్ కి అనిపిస్తుంది. ఇంతమంచి కంటెంట్ ఇండియన్ 2 పెట్టి ఉంటే సరిపోయేది కదా, అనవసరంగా శంకర్ బ్రాండ్ కి చెడ్డ పేరు రాప్ప్పించడం తప్ప ఈ ఇండియన్ 2 ఎందుకు తీసాడు అనిపిస్తుంది.
చివరి మాట :
భారతీయుడు చిత్రాన్ని మనసులో పెట్టుకొని ఈ భారతీయుడు 2 చూస్తే కచ్చితంగా నిరాశకు గురి అవుతారు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే సంతృప్తి చెందగలరు.
రేటింగ్ : 2.5/5