బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ తన లేటెస్ట్ మూవీ గోవిందా నామ్ మేరా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో Kiara Advani Photos ట్రెండీ ఔట్ఫిట్స్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు న్యూ లుక్స్‌తో ఫొటో షూట్ చేస్తూ కియారా అడ్వాణీ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.
లేటెస్ట్గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కియారా పోస్టు చేసిన ఫొటోలు యువతకు పిచ్చెక్కిస్తున్నాయి. వైట్ ఔట్ఫిట్లో మత్తెక్కించే చూపులతో ఘాటు పోజులతో కియారా సోషల్ మీడియాలో హీట్ పుట్టించేసింది. షర్ట్ బటన్స్ విప్పేసి ఫుల్ క్లీవేజ్‌తో కుర్రాళ్లకు బ్యూటీ ట్రీట్ ఇచ్చింది.
కార్తీక్ ఆర్యన బర్త్ డే పార్టీకి కియారా వైట్ డ్రెస్‌లో అటెండ్ అయింది. ఓవైపు దేవకన్యలా కనిపిస్తూనే మరోవైపు తన గ్లామర్ ట్రీట్‌తో పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది కియారా. కియారా గ్లామరస్ ఫోటోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కియారా.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిద్ధార్థ్-కియారా షేర్షా మూవీలో జతకట్టారు.
కియారా టాలీవుడ్లో చేసింది రెండు సినిమాలే అయినా కుర్రాళ్లలో చాలా పాపులారిటీ సంపాదించుకుంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామలో ఓవైపు సంప్రదాయ.. మరోవైపు మోడ్రన్ గర్ల్‌గా ఆకట్టుకుంది. కియారా లేటెస్ట్గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్సీ 15లో మరోసారి రామ్ చరణ్ సరసన నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది.