కియారా అడ్వాణీ.. మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత రామచరణ్‌తో కలిసి వినయవిధేయ రామలో కనిపించింది. వసుమతిగా Kiara Advani తన అమాయకత్వంతో తెలుగు యువకుల మనసు దోచేసింది. ఇటు మోడ్రన్ సీతగా వినయవిధేయ రామలో నటించి తన గ్లామర్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.
ఇక బాలీవుడ్లో ఫగ్లీతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ఎంఎస్ ధోనిలో ధోని భార్యగా తన అందంతో కట్టిపడేసింది. ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ అనే వెబ్‌సిరీస్‌తో తనలోని టాలెంట్‌ను బయటపెట్టింది. అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తూ బీ టౌన్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ ప్రీతిగా కబీర్ సింగ్‌లో నటించి అందరి మన్ననలు అందుకుంది.
షేర్షా, భూల్ భులయ్యా 2 సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన కియారా.. తాజాగా విక్కీ కౌశల్ సరసన గోవింద నామ్ మేరాలో సందడి చేసింది. ఈ మూవీలో కియారా విక్కీ గర్ల్ ఫ్రెండ్‌గా నటించింది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో కియారా అందాల ఆరబోత బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 16న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న కియారా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో తన ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. తాజాగా గోవిందా నామ్ మేరా ట్రైలర్ రిలీజ్ కోసం చేసిన ఫొటో షూట్లో కియారా గ్లామర్ డోస్ పెంచేసింది. సూపర్ విమెన్ కాస్ట్యూమ్‌లో ఎద అందాలు ఉప్పొంగేలా.. టైట్ బ్లాక్ ప్యాంట్ గోల్డెన్ మినీ టాప్‌లో తన వొంపు సొంపులు చూపిస్తూ హీట్ పుట్టించింది.
కుర్రాళ్లను రెచ్చగొట్టేలా పోజులిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టించేసింది కియారా. హాట్ పోజులతో రెచ్చిపోతూ.. కుర్రాళ్లకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఎగిసిపడే యవ్వనాలతో నెటిజన్ల మతిపోగొడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది.
చాలా గ్యాప్ తర్వాత కియారా అడ్వాణీ తెలుగులో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్‌తో `ఆర్‌సీ 15`లో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే రామ్‌చరణ్ మాత్రమే కాదు, కియారా కూడా పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‌గా మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
గోవిందా నామ్ మేరా సినిమా ట్రైలర్‌తో పాటు ఆ మూవీలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసింది టీమ్. ఓ వైపు ట్రైలర్ రిలీజ్ అయి అదరగొడుతుంది. మరోవైపు ఈ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విక్కీ, కియారా మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ దుమ్ములేపేలా ఉంది. ఇందులో వీరిద్దరు రెచ్చిపోయి రొమాన్స్ చేయడం విశేషం. ఈ పాటలో కియారా ఎల్లో శారీ కట్టి రచ్చ చేసింది. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అటువైపు విక్కీనే కాదు ఇటువైపు కుర్రాళ్లను కూడా టెంప్ట్ చేస్తోంది.