Big Boss 7 : టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా నటి వర్ష చాలా పాపులర్ అయింది. జబర్దస్త్ వర్షగా పేరుతెచ్చుకుంది. కొన్ని టీవీ సీరియళ్లలో వర్ష నటించింది. మంచి పర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకుంటోంది. అయితే, ఆమెకు జబర్దస్త్ నుంచి చాలా ఫేమ్ వచ్చింది. కాగా, జబర్దస్త్ వర్ష.. బిగ్‍బాస్ 7 తెలుగు రియాల్టీ షోలో పాల్గొనబోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్‍బాస్ 7వ సీజన్ ప్రోమో వచ్చింది. కానీ, కంటెస్టెంట్‍ల లిస్ట్ ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వర్ష చేసిన కామెంట్లతో ఆమె బిగ్‍బాస్ 7లోకి వెళ్లనుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. సినిమాల ఆఫర్లు వస్తున్నా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే అడుగుతున్నారని వర్ష చెప్పింది.

అయితే, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు తనకు ఆసక్తి లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. త్వరలోనే పెద్ద షోలో కనిపిస్తానని చెప్పింది. తనకు సంబంధించిన చాలా వివరాలను ఆ షోలో వెల్లడిస్తానని వర్ష తెలిపింది. వర్ష చెప్పిన ఆ పెద్ద షో బిగ్‍బాస్ 7 అని చాలా మంది అంచనా వేస్తున్నారు. బిగ్‍బాస్‍లో దాదాపు అన్ని సీజన్లలో జబర్దస్త్ నుంచి ఎవరో ఒకరు పాల్గొంటున్నారు. దీంతో, ఈసారి బిగ్‍బాస్ 7వ సీజన్లో వర్ష.. బిగ్ బాస్ హౌస్‍లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. అయితే, బిగ్‍బాస్ 7లో వర్ష పాల్గొనడంపై ఇంత వరకు అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. మరి, బిగ్‍బాస్ హౌస్‍లోకి వర్ష ఎంట్రీ ఉంటుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. బిగ్‍బాస్ 7వ సీజన్‍కు కూడా ప్రముఖ హీరో కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.

ఇప్పటికే ప్రోమో కూడా వచ్చింది. దీంతో అతిత్వరలోనే బిగ్‍బాస్ 7 ప్రసారం మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ సీజన్‍లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. యాక్టర్ అమర్‌దీప్ చౌదరి, తేజస్విని గౌడ జంట బిగ్‍బాస్ 7లో పాల్గొంటుందని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ శ్వేతా నాయుడు, ఢీ షో ఫేమ్ దీపికా పిల్లి, యాంకర్ విష్ణు ప్రియ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సీనియర్ యాక్టర్ ప్రభాకర్ కూడా బిగ్‍బాస్ 7 హౌస్‍లోకి వస్తాడని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇప్పటికీ ఇవన్నీ ఊహాగానాలే. మరికొన్ని రోజుల్లో బిగ్‍బాస్ 7 సీజన్‍లో కంటెస్టెంట్లు ఎవరు పాల్గొననున్నారో స్పష్టంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.