Bigg Boss 7 Telugu : లో కంటెస్టెంట్‌గా టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌?

- Advertisement -

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ రియాలిటీ షోకు జనాల్లో మంచి క్రేజ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఏడో సీజన్ ను జరుపుకోవడం కోసం ముహూర్తం ఫిక్స్ చేస్తుంది..ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే 7వ సీజన్‌ను ప్రారంభించనున్నట్లు ఇటీవల ఓ వీడియో ద్వారా తెలియజేశారు.. ఆ ప్రోమో విడుదల అయిన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఓ ఇండియా క్రికెటర్ కూడా ఇందులో పాల్గొననున్నారని వార్త హాట్ టాపిక్ అవుతుంది..

Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu

మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా చేయగా మిగిలిన సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఏడో సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున నే హోస్ట్‌గా చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఓ భారత మాజీ క్రికెటర్ అడుగుపెట్టబోతున్నాడట. అతడు మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వై.వేణుగోపాల రావు…అతడిని షోకి తీసుకువచ్చేందుకు బిగ్‌బాస్ బృందం గట్టి ప్రయత్నాలే చేస్తుందని ఆ వార్తల సారాంశం. దీనిపై ఇంత వరకు అటు బిగ్‌బాస్ నిర్వాహకులు గానీ, ఇటు వేణుగోపాల రావు గానీ స్పందించలేదు.

మరీ ఇందులో ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.. ఇతని రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారత్ తరుపున చాలా తక్కువ మ్యాచులే ఆడాడు. 16 వన్లేల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 218 పరుగులు చేశాడు. ఒకే ఒక అర్థశతకం అతడి పేరిట ఉంది. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైనే చేశాడు. అత్యధిక స్కోరు 61 నాటౌట్‌. ఇక ఐపీఎల్‌లో దక్కన్‌ చార్జర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున మొత్తం 65 మ్యాచులు ఆడి మూడు అర్థశతకాల సాయంతో 985 పరుగులు చేశాడు.. ఇక ఎవరు హౌస్ లో సందడి చేస్తారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here