నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో మీకు ఆశ గుర్తుందా. అదేనండి మన విక్టరీ వెంకటేశ్ ఆమె కోసం ప్రియతమా ఇది నిజమా.. ఈ పరిచయం ఒక వరమా అంటూ పాట పాడతాడు కదా. ఆమే ఆశ అదే అదే ఫ్లోరా షైనీ Flora Saini. ఈ భామ టాలీవుడ్లో నువ్వు నాకు నచ్చావ్, నరసింహనాయుడు సినిమాలతో బాగా ఫేమస్. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేదు. రీసెంట్గా ఈ బ్యూటీ తన లైఫ్‌లో జరిగిన ఓ భయనాక ఇన్సిడెంట్ గురించి చెప్పింది. అదేంటంటే..?
ఫ్లోరా షైనీ.. తన లైఫ్‌లో జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఉన్నట్టుండి ఆ విషయం ఎందుకు గుర్తు చేసుకుంది అంటారా. ఇటీవల మన దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ న్యూస్ చదివిన ఫ్లోరా తన లైఫ్‌లోనూ ఇలాంటి అనుభవం ఎదురైందని కాకపోతే తను ముందుగా గుర్తించి తప్పించుకున్నానని చెప్పింది.శ్రద్ధా వాకర్ మర్డర్ దేశంలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు.
తాజాగా దీనిపై టాలీవుడ్ లక్స్ పాప ఫ్లోరా షైనీ స్పందించింది. తన లైఫ్‌లో ఎదుర్కొన్న దారుణమైన సంఘటన గురించి చెప్పింది.కొన్నేళ్ల క్రితం తను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని చెప్పింది ఫ్లోరా. ఆ వ్యక్తి తనను తీవ్ర చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిపింది. తన రిలేషన్షిప్ మొదట్లో బాగా మాట్లాడేవాడని.. తన తల్లిదండ్రులు కూడా అతడు చాలా మంచివాడని అనుకున్నాడని చెప్పింది. అతడి కోసం తన కుటుంబాన్ని కూడా వదులుకున్నానని చెప్పింది ఫ్లోరా.
‘సడెన్‌గా ఒకరోజు నాపై చేయి చేసుకున్నాడు. తన దగ్గర ఉన్న వాళ్ల నాన్న ఫొటో తీసి ‘మా నాన్న మీద ఒట్టు ఇవాళ నిన్ను చంపేస్తా’ అని బెదిరించాడు. ఆ రోజు తను కొట్టిన దెబ్బలకు నా దవడ పగిలిపోయిందేమో.. చనిపోతానేమోనని భయపడ్డాను. ఆ సమయంలో ఏం చేయాలో తోచలేదు. అక్కడే ఉంటే కచ్చితంగా నన్ను చంపేస్తాడనిపించింది. అంతే.. ఒంటి మీద బట్టలు కూడా లేవన్న సోయి లేకుండా అక్కడి నుంచి మా ఇంటికి పరిగెత్తాను. మళ్లీ ఎప్పుడూ అతడి ముఖం చూలేదు. అని చెప్పుకొచ్చింది ఫ్లోరా.