Singer Sunitha : మళ్లీ తల్లి కాబోతున్న టాలీవుడ్ టాప్ సింగర్ సునీత..!

- Advertisement -

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు.. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది.. అంటూ తన మధురమైన గాత్రంతో మరో లోకంలోకి తీసుకెళ్తుంది సింగర్ సునీత. ఆమె పాట కోయిల గానాన్ని మరిపిస్తుంది. చెవుల్లో తేనే పోసినట్లు హాయిగా అనిపిస్తుంది. మధురమైన గాత్రం.. సంప్రదాయకరమైన ఆహార్యం గాయని సునీత సొంతం. తాజాగా నెట్టింట్లో సునీత గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

టాలీవుడ్ సీనియర్ సింగ‌ర్ సునీత గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సునీతా మరోసారి తల్లి కాబోతున్నట్టు ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈమెకు ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. మొదటి భర్తతో విడిపోయి రెండో పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఆమె మరోసారి తల్లి కాబోతోందనే వార్త వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి.

Singer Sunitha
Singer Sunitha

తెలుగు మ్యూజిక్ లవర్స్ ఎంతో ఇష్టపడే సింగర్ సునీత. ఆమె గాత్రం అంటే పడి చచ్చిపోయే వారు చాలా మంది ఉన్నారు. పాటలతో పాటు.. డబ్బింగ్ ఆర్టిస్ట్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సునీత. సునీత గతం చాలా మందికి తెలియదు. ఆమె మధురమైన గానం వెనక ఓ విషాద రాగం ఉంది. చిన్న వయసులోనే పెళ్లై పోయి.. ఇద్దరు పిల్లలకు తల్లయిన సునీత ఆ తర్వాత భర్త వల్ల ఎన్నో కష్టాలు పడింది. చాలా ఏళ్లు భర్తకు దూరంగా ఉంటూ ఒంటరిగా పిల్లలను పెంచింది.

- Advertisement -

కొన్నేళ్లకు అతడికి విడాకులు ఇచ్చి తన పిల్లల భవిష్యత్​ కోసం చాలా కష్టపడింది సునీత. రీసెంట్​గా టాలీవుడ్ బిజినెస్ మ్యాన్, మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ ఓనర్ రామ్​ను రెండో పెళ్లి చేసుకుంది. తన ఇద్దరు పిల్లలు, భర్త, కొత్త ఫ్యామిలీ సునీత హ్యాపీగా ఉంటోంది.

రామ్​ను రెండో పెళ్లి చేసుకున్న సునీత ప్రస్తుతం తల్లి కాబోతోందన్న వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రామ్‌కు కోట్లాది రూపాయ‌ల వ్యాపారాలు ఉన్నాయి. ఆర్థికంగా వీళ్లు ప్రస్తుతం చాలా మంది స్థాయిలో ఉన్నారు. అందుకే రామ్-సునీతలు తమ ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డను కనాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆ గుడ్​న్యూస్ కూడా వచ్చేసిందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సునీత టీమ్ నుంచి కానీ రామ్ టీమ్​ నుంచి కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సునీత రెండో పెళ్లి చేసుకున్నందుకు ఇప్పటికే ఆమెపై చాలా రకాల నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఆమెను రకరకాలు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే సునీత ఈ ట్రోలర్స్​పై కాస్త గట్టిగానే సీరియస్ అయింది. ఇప్పుడు ఆమె తల్లి కాబోతోందన్న విషయంలో వైరల్ అవుతోన్న నేపథ్యంలో ట్రోలర్స్ ఈసారి ఎలాంటి కామెంట్స్ చేస్తారో.

ఏది ఏమైనా సునీత ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఎట్టకేలకు సునీత తన లైఫ్​లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటోందని అభిమానులు కూడా సంబురపడి పోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here