Deepthi Sunaina : డబ్బు స్మాష్ వీడియోలతో బాగా పాపులర్ అయిన క్యూట్ బ్యూటీ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన వీడియోలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసింది. ఇలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ కూడా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది..
దీప్తి సునయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే షణ్ముఖ్ జస్వంత్ తో తన లవ్ మ్యాటర్ రీవిల్ చేసింది.. కాగా ఆ తరువాత షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లోకి వెళ్లడం.. సిరి హనుమంత్ తో లవ్ ట్రాక్ నడపడం చూసిన దీప్తి సునయన షణ్ముఖ జస్వంత్ కి హౌస్ నుంచి బయటికి రాగానే బ్రేకప్ చెప్పేసింది. అప్పట్లో వీళ్ళిద్దరి బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.. ఆ తరువాత దీప్తి సునయన సోషల్ మీడియాలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది.
దీప్తి సునయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఏకంగా నాలుగు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.. ఈ అమ్మడు రీల్స్ తో పాటు ఈ మధ్య గ్లామర్ బాట పట్టింది.. లేటెస్ట్ ఫోటో షూట్ లతో కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది.. సంప్రదాయ దుస్తుల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా.. మోడరన్ డ్రెస్ లో మైమరిపించే అందాలతో మాయ చేస్తుంది..
తాజాగా అమ్మడు ఇంకాస్త డోస్ పెంచింది.. పొట్టి బట్టలో యోగాసనాలు వేసింది.. ఉదయం ఉషోదయ వేల నులి వెచ్చని సూర్యుని కిరణాలు దీప్తి సునయన మేనిని తాకుతుంటే.. సూర్య నమస్కారాలు చేస్తున్న దీప్తి సునైనా హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ప్రతిరోజు సూర్య నమస్కారాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మం యవ్వనంగా తయారవుతుంది.. దీప్తి సునయన సూర్య నమస్కారాలు వేసి ఇన్ డైరెక్ట్ గా తన బ్యూటీ సీక్రెట్ ను రివిల్ చేసింది..