Deepika Padukone : బాలివుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామిని సృష్టించింది. బాలీవుడ్ బాద్షాకి సరైన కమర్షియల్ చిత్రం పడితే బాక్సాఫీస్ జాతర ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. ఐదురోజుల్లోనే పఠాన్ చిత్రం 500 కోట్లకి పైగా వసూళ్లతో మామూలు రచ్చ చేయడం లేదు.. ఈ దెబ్బతో బాలివుడ్ రికార్డులు మరోసారి బ్రేక్ అయ్యినట్లే.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతోంది.. ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.ఈ ఇందులో కూడా షారూక్ ను దీపికా వదల్లేదు..లైవ్ లో ముద్దులు, హగ్గులు ఇచ్చింది.. అది కాస్త వైరల్ గా మారింది…
ఈ సినిమా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, కెజిఎఫ్ 2 చిత్రాల రికార్డులని అదిమిస్తోంది అంటే ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ దక్కుతోందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో వివాదాల నడుమ జనవరి 25న ఈ చిత్రం విడుదలయింది. షారుఖ్, దీపికా జంటగా నటించగా.. జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు. ఇక తాజాగా జరిగిన ప్రెస్ మీట్ కి దీపికా పదుకొనె ముద్దమందారం లాగా అందంగా.. హాట్ గా ముస్తాబై వచ్చింది. ఆమె ధరించిన గౌన్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది..
క్లివెజ్ అందాలతో స్టేజ్ పైనే దీపిక అందరిని ఆకర్శించింది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వేదికపై దీపికా, షారుఖ్ కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీపిక.. షారుఖ్ విషయంలో తీసుకుంటున్న కేరింగ్ అంతా ఇంతా కాదు. అలాగే షారుఖ్ కు ప్రేమగా ఒక ముద్దు కూడా ఇచ్చింది.. అక్కడ కూడా వదలవా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మితిమీరిన అందాల ప్రదర్శన వల్ల ఈ చిత్రంపై వివాదాలు మొదలయ్యాయి. హిందూ సంఘాలు, భజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పఠాన్ ప్రదర్శనని అడ్డుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.. మొత్తానికి ఈ సినిమా బాలివుడ్ ను మళ్ళీ నిలబెట్టింది..