Pathan Collection : ‘పఠాన్​’ క్రేజీ కలెక్షన్స్.. రెండ్రోజుల్లో రూ.200 కోట్లు.. తగ్గేదేలే అంటూ షారుక్ ట్వీట్

- Advertisement -

Pathan Collection : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​.. బీ టౌన్ దివా దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా పఠాన్. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత షారుక్ తెరపై సందడి చేశాడు. ఐదేళ్ల ముందు కూడా షారుక్​కు వరుస పరాజయాలే. ఓ సరైన హిట్ కోసం షారుక్ దాదాపు ఓ దశాబ్ధం నుంచి ఎదురుచూస్తున్నట్టే లెక్క. ఇన్నేళ్ల నిరీక్షణ.. ఇన్నాళ్ల కఠోర శ్రమ ఫలించింది. ఎట్టకేలకు పఠాన్ రిలీజ్ అయింది.

Pathan Collection
Pathaan Collection

రిలీజ్ అంటే మామూలు రిలీజ్ కాదండోయ్. బ్లాక్​బస్టర్ రిలీజ్.. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ కింగ్ ఖాన్​ను కాస్త కలెక్షన్ కింగ్ చేసేసింది పఠాన్ మూవీ. ఐదేళ్ల తర్వాత షారుక్​ను తెరపై చూస్తున్న ప్రేక్షకులకు ఓ మైకంలో మునిగిపోతున్నారు. అందులోనూ సూపర్ పవర్​ఫుల్ యాక్షన్​ మోడ్​లో షారుక్​ను చూసి ఫిదా అవుతున్నారు. ఇక అమ్మాయిలైతే షారుక్ బాడీని చూసి మనసిచ్చేస్తున్నారు.

సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల విషయంలో తొలి రోజు నుంచే దూకుడు ప్రదర్శిస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వసూలు చేసింది. దేశవ్యాప్తంగా రూ.120కోట్లను అందుకుంది. కేజీయఫ్​ సినిమా ఫస్ట్ డై కలెక్షన్లు బ్రేక్ చేయాలంటే దానిని మించిన సినిమా రావడానికి ఏళ్లు పడుతుందని అందరూ భావించారు. కానీ బాద్​షా ఇలా బాక్సాఫీస్​లో ఎంట్రీ ఇచ్చాడు. అలా చాలా ఈజీగా కేజీయఫ్ కలెక్షన్లను బ్రేక్ చేసేశాడు.

- Advertisement -

పఠాన్​ మూవీకి వస్తోన్న క్రేజీ రెస్పాన్స్.. అంతకుమించి వస్తోన్న క్రేజీ కలెక్షన్స్​ను చూసి షారుక్​ తెగ సంబురపడిపోతున్నాడు. ఈ క్రమంలో ఈ కింగ్ ఖాన్​ ట్వీట్ చేశాడు. ‘వెనక్కి తిరిగివెళ్లడానికి నా దగ్గర ఏమీ లేవు. ఎప్పుడూ ముందుకే అడుగులు వేయాలి. వెనక్కి తగ్గొద్దు. జీవితం చాలా చిన్నది. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి. ఓ 57ఏళ్ల వ్యక్తి సలహా ఇది’ అంటూ ట్వీట్ చేశాడు.

Shah Rukh Khan Pathaan Collection

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన పఠాన్​ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ఇండియ‌న్ రా ఏజెంట్​గా షారుక్ ఖాన్ కనిపించారు. ఇక ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర‌లో దీపికా ప‌డుకొణె నటించారు. బాలీవుడ్ భాయ్​ స‌ల్మాన్‌ ఖాన్ అతిథి పాత్ర‌లో కనిపించి సినిమాకే హైలైట్​గా నిలిచారు. భార‌త‌దేశంపై దాడికి ప్రణాళిక రచించిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ప్లాన్‌ను ప‌ఠాన్ ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ సినిమా కథాంశం. క‌థ కన్నా యాక్ష‌న్ అంశాల‌కే అధికంగా ప్రాముఖ్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఇదిలా వుంటే ‘పఠాన్’ బ్లాక్ బస్టర్ హిట్​తో మల్టీవర్స్ మూవీస్​కు మరింత ఊతం లభించినట్టనిపిస్తోంది. మల్టీవర్స్​లో భాగంగానే ఇందులో సల్మాన్ ఖాన్ టైగర్​గా కనిపించి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ స్ఫూర్తితో మరిన్ని మల్టీవర్స్ నేపథ్య సినిమాలు తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోందిని ఇన్ సైడ్ టాక్.

మరోవైపు ‘పఠాన్‌‘ పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. దక్షిణాది దర్శకుల్లా బాలీవుడ్‌ వాళ్లు కమర్షియల్‌ చిత్రాలు తెరకెక్కించలేరనే అపోహను ఈ సినిమా పటాపంచలు చేసిందని ఆయన అన్నారు. ఈ మేరకు’పఠాన్‌’ టీమ్‌ను మెచ్చుకుంటూ తాజాగా ఓ ట్వీట్‌ పెట్టారు.

“1. ఓటీటీ వృద్ధి చెందుతోన్న ఈరోజుల్లో థియేటర్‌ కలెక్షన్స్‌ మళ్లీ మెరుగుపడవు. 2. షారుఖ్‌ కెరీర్‌ అయిపోయింది. 3. దక్షిణాది దర్శకులు తెరకెక్కించిన విధంగా బాలీవుడ్‌ వాళ్లు కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించలేరు. 4. ‘కేజీయఫ్‌-2’ తొలిరోజు కలెక్షన్స్‌ను బ్రేక్‌ చేయడానికి కొన్నేళ్లు సమయం పడుతుంది. అయితే.. పైన పేర్కొన్న అపోహలన్నింటినీ ‘పఠాన్‌’ పటాపంచలు చేసింది” అని వర్మ తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here