Cinema Gossips : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో మాత్రం ఊహించడం కాస్త కష్టమే.. సినిమాల్లో అవకాశాల మాట పక్కన పెడితే రుమెర్స్ కు కెరాఫ్ గా కొందరు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు..ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల చిన్ననాటి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఓ చిన్నపాప తో చిరంజీవి, బాలయ్య లు కలిసిన దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే చిరంజీవి బాలకృష్ణ లతో విడివిడిగా ఫోటో దిగడమే చాలా కష్టం అలాంటిది ఇద్దరితో కలిసి ఫోటో దిగిన ఈ అమ్మాయి ఎవరో అని అందరు నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఆ పాప ఎవరో కాదు ప్రొడ్యూసర్ అశ్విని దత్, కూతురు ప్రియాంక దత్ ..ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమాలు మనకు అన్నం పెడుతున్నాయి అంటూ దైవంగా భావిస్తున్నారు.వైజయంతి బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన అశ్వినీ దత్ విలువలతో కూడిన సినిమాలను తీస్తూ ఉంటాడు.

ఇక ఆయన కూతురైన ప్రియాంక దత్ కూడా తండ్రి బాట ను ఎంచుకొని నిర్మాణ రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది . పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి వారికి కూడా నిర్మాతగా పనిచేసింది. అయితే ఈమె సినిమాల్లొకి రాకముందు బొంబాయి లోని ఓ దర్శకుడు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిందట..
ఇక 2009 లో ఎంజిల్ పేరుతో ఒక స్టూడియో ను స్టార్ట్ చేశారు.ఈ బ్యానర్లో నారా రోహిత్ యాక్ట్ చేసిన బాణం , నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ, కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలు వచ్చాయి. ఇలా సందేశాత్మకంగా ఉండే చిత్రాలు నిర్మిస్తూ, సినిమా పట్ల మంచి అభిరుచిని సమాజం పట్ల బాధ్యతలు చూపిస్తూ వస్తున్నారు ప్రియాంక దత్..జాతి రత్నాలు సినిమాను కూడా ఈమె నిర్మించింది..సక్సెస్ ప్రోడ్యూసర్ గా వరుస సినిమాలను నిర్మిస్తుంది..