మెగాస్టార్ Chiranjeevi ఇప్పుడు వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు.. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సంక్రాంతికి మెగా మాస్ ట్రీట్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో నిన్న రాత్రి వైజాగ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ వేదికపై చిరంజీవి తన మనసులో మాట బయటపెట్టారు. ముందు వైజాగ్ గొప్పతనం గురించి మాట్లాడి అక్కడి జనాన్ని హూషారెత్తించారు చిరంజీవి. విశాఖలో విశాలమైన మనసున్న మనుషులు ఉంటారని అన్నారు మెగాస్టార్.
ఈ నగరం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన ఆయన.. ఈ నేల అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు.శేష జీవితాన్ని వైజాగ్ లో గడపాలని అనుకుంటారు..తనకు కూడా అలాంటి చిరకాల కోరిక ఉందంటూ ఓపెన్ అయ్యారు. అందుకే ఈ మధ్యనే విశాఖలో స్థలం కొన్నానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.భీమిలి వెళ్లే దారిలో స్థలం కొనుక్కున్నా అని చెప్పిన చిరంజీవి.. త్వరలోనే అక్కడ ఇల్లు కట్టి విశాఖ వాసుడిని అవుతాను అని సభాముఖంగా చెప్పారు. అంతేకాదు ఇదే తన చిరకాల కోరిక అంటూ విశాఖ సాక్షిగా మనసులో మాట బయటపెట్టారు చిరు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఆదివారం ‘వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గాజరిగిన సంగతి తెలిసిందే..మాస్ కమర్షియల్ అంశాలతో వాల్తేరు వీరయ్య రంగంలోకి దూకుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది..ఇక ఈ సినిమాకు ఒకరోజు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదల కానుంది..రెండింటి లో ఏ సినిమా సక్సెస్ను అందుకుంటుందో చూడాలి..