Shruti Haasan : ‘వాల్తేరు వీరయ్య ‘ ప్రీరిలీజ్ ఈవెంట్ కు శృతిహాసన్ ఎందుకు రాలేదో తెలుసా?



రీ ఎంట్రీ ఇచ్చిన Shruti Haasan బిజీ బిజిగా వుంది.. వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం తెరకెక్కుతున్న స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తుంది.. ఇప్పుడు చిరంజీవి ,బాలయ్య సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది.ఇటీవల ఒంగోలులో జరిగిన వీరసింహరెడ్డి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేసిన హీరోయిన్‌..నిన్న విశాఖపట్టణంలో జరిగిన మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనూ పాల్గొనాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా తాను వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రాలేకపోతున్నట్లు చెప్పింది. అయితే.. తాజాగా వాల్తేరు వీరయ్య ఈవెంట్‌లో హీరో చిరంజీవి మాట్లాడుతూ.. శృతిహాసన్‌ రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Shruti Haasan
 in Waltair Veerayya
Shruti Haasan
in Waltair Veerayya

ఇటీవల ఒంగోలు ఈవెంట్‌కు వెళ్లినప్పుడు ఎవరైనా బెదిరించారేమో అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. చిరంజీవి సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలకు అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవికి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హీరోయిన్ శృతి హాసన్ హాజరవుతారని అంతా భావించారు. అయితే శృతిహాసన్‌ తాను ఈ ఈవెంట్‌కు రాలేకపోతున్నానని సోషల్ మీడియాలో తెలిపింది. నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి, ఆమె అనారోగ్యంతో ఉన్న వార్తను అభిమానులతో పంచుకుంది. తన అనారోగ్యం కారణంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేకపోతున్నందుకే హార్ట్ బ్రేక్ అవుతుందని పేర్కొంది..

Shruti Haasan chiranjeevi

ఒక్కో సినిమాలో చిరు ఒక్కొలా కనిపిస్తున్నారు..ఆచార్య టూ గాడ్ ఫాదర్ సినిమాలకు, ‘వాల్తేరు వీరయ్య‘. సినిమాకు లుక్ చాలా చెంజ్ అయినట్లు డైరెక్టర్ బాబీ అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ నుంచి ఇంతవరకూ వదిలిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. వాల్తేరు వీరయ్య ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా బాస్ మాస్ డైలాగ్స్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..నిజానికి శృతి హాసన్ రాకపొవడానికి కారణాలు ఏంటా అని చర్చలు జరుగుతున్నాయి..