Ariyana Glory .. మూడేళ్ల క్రితం వరకు ఈ పేరు కూడా ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోకు ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి చాలా ఫేమస్ అయింది. ఇక యూత్ లో ఈ బ్యూటీ పాపులర్ అవ్వడానికి ఇంకో కారణం ఈ భామ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేయడం. ఈ బోల్డ్ ఇంటర్వ్యూతో అరియానా పేరు మార్మోగిపోయింది.
అలా బిగ్ బాస్, ఆర్జీవీ ఇంటర్వ్యూతో కాస్త ఫేమ్ సంపాదించిన అరియానా దాన్ని నిలబెట్టుకునేందుకు చాలా కష్టపడుతోంది. ఓవైపు బుల్లితెరపై రియాల్టీ షోస్ చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఎలాగైనా సినిమా ఛాన్సులు రావాలని తెగ ఆరాటపడుతోంది. అందుకోసమే కాస్త గ్లామర్ డోస్ పెంచి ఫొటోషూట్స్ చేస్తూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
బిగ్ బాస్ షోలో సన్నగా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య ముద్దుగా బొద్దుగా తయారైంది. ఇక తన అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వరుస ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తోంది. అయితే ఈ మధ్య అరియానా గ్లామర్ డోస్ పెంచేసినట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా ఈ భామ పోస్టు చేస్తున్న ఫొటోల్లో చాలా ఘాటు పోజులిస్తూ బోల్డ్ ఔట్ ఫిట్స్ లో కనిపిస్తోంది. అలాంటి ఔట్ ఫిట్ లోనే తాజాగా అరియానా ఫొటోషూట్ చేసింది.
వైట్ కలర్ క్రాప్ టాప్, టార్న్ జీన్స్ లో అరియానా మెరిసిపోయింది. క్లీవేజ్ షోతో మతిపోగొట్టింది. అందాల ప్రదర్శనలో తనకు అడ్డే లేదన్నట్టుగా పోజులిస్తూ కైపెక్కించింది. ఈ భామ పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రకారు హార్ట్ బీట్ అమాంతం రైజ్ అయిపోయింది. ప్రస్తుతం అరియానా హాట్ లుక్స్ ఇంటర్నెట్ ను షేర్ చేస్తున్నాయి.