Bigg Boss 8 బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ నెల నుండి గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 7 భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, సీజన్ 8 అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈసారి కూడా విన్నూతన రీతిలో, ఆ అంచనాలకు మించి ఈ చిత్రం ఉండేలా యాజమాన్యం ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ కి సంబంధించి పలువురి పేర్లు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉన్నాయి. అయితే కచ్చితంగా ఖరారైన కంటెస్టెంట్స్ లో బుల్లితెరకు సంబంధించిన కొంతమంది హాట్ యాంకర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
వారిలో మొదటగా వినిపిస్తున్న పేరు వర్షిణి. బుల్లితెర యాంకర్ గా ఈమెకి ఎంత మంచి క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఢీ షో ద్వారా ఈమెకి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె బాగా పాపులర్. గత రెండు సీజన్స్ నుండి బిగ్ బాస్ యాజమాన్యం ఈమె కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈమె మాత్రం ఆ రెండు సీజన్స్ ని పక్కన పెట్టి, ఈ సీజన్ లో పాల్గొనేందుకు సిద్ధమైందని టాక్. ఈమె తర్వాత బుల్లితెర యాంకర్ గా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న విష్ణు ప్రియా కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈమె ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే కిరాక్ బాయ్స్, ఖిలాడీ లేడీస్ ప్రోగ్రాం లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. అలాగే బోల్డ్ షోస్ తో యాంకర్ గా అదరగొడుతున్న రీతూ చౌదరీ, యూట్యూబర్ గా, యాంకర్ గా మంచి పాపులారిటీ ని సంపాదించినా భ్రమరాంబ టూటీక వంటి వారు కూడా ఈ షో లో పాల్గొనబోతున్నారు. ప్రతీ సీజన్ లో కేవలం ఒక్క యాంకర్ కి మాత్రమే బిగ్ బాస్ సీజన్ లో అవకాశం దక్కేది, కానీ ఈసారి ఏకంగా నలుగురు యాంకర్లకు అవకాశం దక్కడం విశేషం. టాస్కుల పరంగా కూడా గేమ్స్ ఈసారి మొదటి వారం నుండే కఠినంగా ఉండబోతున్నాయట. చూడాలిమరి ఈ షో బిగ్ బాస్ సీజన్ 7 కంటే పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది.