Allu Arjun : ‘జైలర్’ డైరెక్టర్ తో అల్లు అర్జున్..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయి అప్డేట్!

- Advertisement -

Allu Arjun వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి మరోసారి పూర్వ వైభవం ని తెచ్చిపెట్టిన చిత్రం ‘జైలర్’. ‘డాక్టర్’ వంటి హిట్ తర్వాత ‘బీస్ట్’ లాంటి ఫ్లాప్ ని అందుకున్న డైరెక్టర్ నెల్సన్, ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఎలా అయితే చూపించాలో, అలా చూపించి ఫ్యాన్స్ కి థియేటర్స్ లో చొక్కాలు చింపుకునేంత ఊపుని ఇచ్చాడు. తెలుగు, తమిళం భాషలకు కలిపి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నెల్సన్ ఏమయ్యాడు?, అసలు కనిపించడం లేదే, ఏ హీరో తో చేస్తున్నాడు అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.

Allu Arjun
Allu Arjun

ఇప్పటికే ఆయన చిరంజీవి తో ఒక చిత్రం చేసేందుకు చర్చలు జరిపాడు. ఆ చిత్రం పట్టాలెక్కనుందా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు కానీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మాత్రం నెల్సన్ చిత్రం ఖరారైంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా ఉన్న అల్లు అర్జున్, ఈ చిత్రం పూర్తి అవ్వగానే నెల్సన్ తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ సినిమాకి సంగీతం అనిరుద్ అందించనున్నాడు. స్వతహాగా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న అల్లు అర్జున్ కి అనిరుద్ లాంటి సంగీత దర్శకుడు తోడైతే ఎలాంటి సెన్సేషనల్ సాంగ్స్ వస్తాయో ఊహించుకోవచ్చు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది.

Jailer' director Nelson Dilipkumar meets Allu Arjun. A film on the cards? - India Today

- Advertisement -

ఇప్పటికే సందీప్ వంగ తో అల్లు అర్జున్ ఒక ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రం తో పాటుగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా, తమిళ దర్శకుడు అట్లీ తో మరో సినిమా కమిట్ అయ్యాడు. వీటిలో ఎదో ఒక ప్రాజెక్ట్ పుష్ప 2 తర్వాత మొదలు అవ్వుధి అనుకున్నారు కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా నెల్సన్ సినిమా మొదలు కాబోతుంది. ఇక పోతే దేశం మొత్తం ఎదురు చూస్తున్న పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి, రెండు పాటలకు అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాకి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.

Pushpa: The Rule - Part 2 (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here