చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం Waltair Veerayya. బాబీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు..ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి..
ముందుగా రిలీజ్ అయిన టైటిల్ టీజర్, ఆ తరువాత రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు ఇటీవల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రతి ఒక్కటి అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది.. ఇక ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ఇంకా టాప్ లోనే ట్రెండ్ అవుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు..మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ అనే చెప్పాలి..
![Waltair Veerayya](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/01/n46024850016732383790473caa11b071c7c519a46b68a6af2c2e36a7b2e8d6b7ff7a98b28d4b3978c1e764-1-1024x576.webp)
సినిమాకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఇక తాజాగా విశాఖపట్నంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అద్భుతంగా నిర్వహించారు.దింతో చాలామంది చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయనున్నారు అని తెగ సంతోషిస్తున్నారు. . ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మల్టీస్టారర్ ఈనెల 13న గ్రాండ్‌గావిడుదల కానుంది. దీనికి ముందు సినిమా ప్రమోషన్లలో భాగంగా విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు..ఈ ఈవెంట్ లో టీమ్ అందరు ప్రేక్షకులను ఆకట్టుకొనేలా స్పీచ్ మాట్లాడారు..
![Waltair Veerayya Movie](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/01/n46112787616734519800205000387256e28f6397c2350925776d2cffd952fecb342b15eafef7c3e4ec873c-1024x555.webp)
రవితేజ గురించి ఎవరికీ తెలియని విషయాలను అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 తరువాత మళ్లీ సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విమర్శల బారిన పడింది. స్టార్ చిరంజీవి పోస్టర్లో చిరంజీవి ఒక పడవ మీద నిలబడి వస్తూ ఉండగా, ఆ పడవ మీద చిరంజీవికి ఎంతో ఇష్టమైన ఆంజనేయస్వామి ఫోటోతో ఒక జెండా కనిపిస్తూ ఉంటుంది. ఇది చూసిన చాలా మంది హనుమంతుడి జెండా పక్కన నిలబడి బీడీ కాల్చడం ఏంటి?..దేవుడిని అవమానించారు అంటూ సినిమాను బాయికాట్ చెయ్యాలని కొందరు విమర్షిస్తున్నారు..మరి చిత్ర యూనిట్ ఏం వివరణ