Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’లో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే సీన్స్ అవేనట



Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి థియేటర్ కి వస్తున్నాడు. వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకులను అలరించనున్నాడు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 13 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజ రవితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్నయ్య మూవీ తర్వాత చిరు-రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం కావడం.. ఇద్దరు పవర్ ప్యాక్ హీరోస్ కలిసి వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. 

 Waltair Veerayya
Waltair Veerayya

ఇప్పటికే విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూనకాలు లోడింగ్ అంటూ ప్రేక్షకులు ఈ సినిమా ట్రైలర్ కు నీరాజనాలు పడుతున్నారు. ఇక ఈ చిత్రంలో పలు సంభాషణలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయి. ఈ సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ వీరయ్య లోకల్, కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అమ్మా అంటూ వచ్చే డైలాగ్స్ ఇప్పటికే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇలాంటివి ఈ మూవీస్ లో ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయట. మరి ఆ డైలాగ్స్ ఏంటి.. అసలు ఈ డైలాగ్స్ ఆ మూవీలో ఎందుకు పెట్టారో చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

Ravi Teja and Chiranjeevi

నా అభిమానులు ఏం కోరుకుంటారో దానిని ఇవ్వడానికి నేను తపన పడుతుంటాను. వైవిధ్యభరితమైన సినిమాలు, పాత్రలు చేయడాన్ని ఇష్టపడతాను. ఈ సినిమాలో పాత చిరంజీవిని మళ్లీ చూస్తారు. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మెగుడు’, ‘ముఠా మేస్త్రీ’ల్లో చిరంజీవి ఎలా ఉన్నాడో ‘వాల్తేరు వీరయ్య’లో కూడా అలా ఉంటాడు. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. నా కాస్టూమ్స్‌ కూడా చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు ఇంత మాస్‌గా కనిపించలేదు.” అని చిరు చెప్పుకొచ్చారు.

రవితేజ ఆరోజుల్లో ఎలా ఉన్నాడో ఈరోజూ అలానే ఉన్నాడు. తన ఎనర్జీతో ఈ సినిమాకు మరింత ప్లస్‌ అయ్యాడు. కథకు బలాన్ని చేకూర్చాడు. ఈ పాత్రకు రవితేజ అయితే బాగుంటుందని అందరం అనుకున్నాం. ఈ సినిమాలో ఇద్దరం డైలాగ్‌లు మార్చుకున్నాం. తన ఇడియట్‌లో డైలాగ్‌ నేను.. నా సినిమాలో డైలాగ్‌ తను చెప్పాడు. ఫ్యాన్స్‌కు కిక్‌ ఇవ్వడం కోసమే అలా డైలాగ్స్‌ మార్చుకున్నాం.” అని చిరంజీవి అసలు సంగతి చెప్పారు.

“బాబీ  నాకు పెద్ద అభిమాని. నా అభిమానిగా అతడిని ఇష్టపడ్డాను. దర్శకుడిగా దాసోహమయ్యాను. డైరెక్టర్‌గా ఎక్కువ మార్కులు సంపాదించాడు. చాలా కష్టపడ్డాడు. ఏదైనా సీన్‌ మార్చాలంటే తన టీంతో రాత్రంతా కూర్చొన్ని ఆలోచిస్తాడు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి.. వాళ్ల నాన్న చిన్నదినం జరిగిన వెంటనే షూటింగ్‌కు వచ్చాడు. అంత కమిట్‌మెంట్‌తో పనిచేస్తాడు. అందుకే బాబీకి నేను అభిమానిని అయ్యాను. ఈ సినిమా హిందీలో కూడా ‘పుష్ప’లాగా ప్రేక్షకాదరణ పొందుతుందని అనుకుంటున్నాను.” అని చిరంజీవి అన్నారు.

Tags: