Balakrishna నందమూరి బాలయ్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు.. సినిమాల్లో మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా గొప్ప మనసున్న హీరోనే.. రియల్ లైఫ్ లో కూడా బాలయ్య హీరోనే.. సాయం కోరిన వాళ్లకు బాలయ్య కాదనకుండా సాయం చేస్తాడు.. తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు బాలయ్య.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారిగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నందమూరి హీరో. బాలయ్య హ్యాట్రిక్ సాధించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటారు.. అందుకే ప్రజలు ఆయన పాలన కోసం మూడుసార్లు గెలిపించారు..
ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు బాలయ్య.. స్థానిక ప్రజలతో కలిసి భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలి భుజంపై ఆప్యాయంగా చేయి వేసి పలకరించారు.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇది చూసిన అభిమానులు మా బాలయ్య బాబు గోల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చెయ్యబోతున్నాడు..