Rakul Preet Singh ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న వారిలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. తక్కువ సమయం లో పెద్ద స్టార్ గా ఎదిగేలోపు ఈమెకి బాగా దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ, ఎంత వేగంగా ఎదిగిందో, అంతే వేగంగా కింద పడిపోయింది. వరుసగా చేతినిండా ఆఫర్స్ తో సినీ రంగం లో నెంబర్ 1 వైపు దూసుకెళ్తున్న సమయంలో ఫ్లాప్స్ పడడంతో బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ కూడా ఫ్లాప్స్ ఎదురు అవ్వడంతో ఇప్పుడు ఈమె చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. అవకాశాలు బాగా తగ్గిపోవడం తో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరి పెళ్లి గోవా లో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. అయితే పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఇంకా దయనీయంగా మారిపోయింది.
ఈమె అడుగుపెట్టిన వేళావిశేషం జాకీ భగ్నాన్ని అప్పుల పాలయ్యాడు. రీసెంట్ గానే ఆయన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘చోటే మియా..బడే మియా’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. 200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో జాకీ భగ్నానీ అప్పుల పాలయ్యాడు. తన ఆఫీస్ లో పనిచేస్తున్న స్టాఫ్ కి కూడా జీతాలు ఇవ్వలేక తన కంపెనీలన్నిటినీ మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరోపక్క రకుల్ ప్రీత్ సింగ్ కి జిమ్, రెస్టారంట్ తప్ప మరో బిజినెస్ లేదు. సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం వస్తున్న ఆఫర్స్ లో కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకునేందుకు సిద్ధంగా లేరు.
త్వరలో రణబీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రామాయణం లో రకుల్ ప్రీత్ సింగ్ కి సూర్పనక్క క్యారక్టర్ చేసే అవకాశం వస్తే, ఆమె దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సీత స్థాయి పాత్రలు పోషించాల్సిన రకుల్ ప్రీత్ సింగ్, ఇలా రాక్షసి తరహా విలన్ రోల్ చెయ్యడానికి ఒప్పుకుందంటే ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే ఈమె తన భర్త జాకీ భగ్నానీ అప్పులలో కొంతభాగం తనవంతుగా తీర్చేందుకు కూడా సిద్దపడింది అట. ప్రస్తుతం ఈమెకి వస్తున్న సినిమా ఆఫర్స్ కి అది ఎలా సాధ్యం, అనవసరంగా పెళ్లి చేసుకొని కష్టాలపాలు అయ్యావు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.